ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాబిలిపై ఆక్సిజన్‌ పైప్‌లైన్‌!

ABN, Publish Date - Nov 18 , 2024 | 03:25 AM

చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్‌’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!

  • దక్షిణ ధ్రువం వద్ద ఏర్పాటు చేసేందుకు నాసా కసరత్తు

న్యూయార్క్‌: చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్‌’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది! ఎందుకంటే.. భవిష్యత్తులో చేపట్టబోయే ఇతర అంతరిక్ష యాత్రలకు చందమామను ఒక బేస్‌గా వాడుకోవాలంటే అక్కడ ఉన్న వనరులతోనే వ్యోమగాములు మనుగడ సాగించగలగాలి. అలా సాగించడానికి వారికి అన్నింటికన్నా అత్యంత అవసరమైనది, కీలకమైనది ప్రాణవాయువే. కానీ, అది చంద్రుడి మీద అస్సలు ఉండదు. కాబట్టి.. జాబిలి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మంచు పొరల నుంచి వ్యోమగాములకు అవసరమైన ఆక్సిజన్‌ను సంగ్రహించి, దాన్ని వ్యోమగాములు ఉండే బేస్‌లకు తరలించేలా రోబోల సాయంతో దాదాపు 5 కిలోమీటర్ల నిడివిగల పైప్‌లైన్‌ వ్యవస్థను నిర్మించేందుకు నాసా కసరత్తు చేస్తోంది. ఈ వినూత్న ప్రాజెక్టుకు నాసా.. ‘లూనార్‌ సౌత్‌పోల్‌ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ (ఎల్‌-ఎ్‌సపాప్‌)’ అని పేరు పెట్టింది. అన్నట్టు.. ‘ఆర్టెమిస్‌’ అంటే.. గ్రీకు, రోమన్‌ పురాణాల్లో ‘చంద్ర దేవత’ పేరు. గతంలో నాసా చేపట్టిన చంద్రయాత్రలన్నింటికీ ‘అపోలో’ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అపోలో అంటే.. గ్రీకు దేవుడి పేరు. ఆయన సోదరి ‘ఆర్టెమిస్‌’. 1972లో చేపట్టిన ‘అపోలో 17’.. అప్పట్లో నాసా ఆఖరి మూన్‌ మిషన్‌. మళ్లీ ఇప్పుడు ‘ఆర్టెమిస్‌’ పేరుతో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.

Updated Date - Nov 18 , 2024 | 03:26 AM