ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Train Accident: పట్టాలు తప్పిన ప్రయాణికుల ట్రైన్.. 140 మందికి గాయాలు..

ABN, Publish Date - Jul 29 , 2024 | 08:07 PM

800 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ట్రైన్ ఆకస్మాత్తుగా పట్టాలు(train accident) తప్పింది. ఓ ట్రక్కును రైలు ఢీకొనడంతో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 140 మంది గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

Russia train accident

800 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ట్రైన్ ఆకస్మాత్తుగా పట్టాలు(train accident) తప్పింది. ఓ ట్రక్కును రైలు ఢీకొనడంతో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 140 మంది గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఈ ఘటన రష్యా(Russia )లోని దక్షిణ వోల్గోగ్రాడ్(Volgograd) ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. రైలు రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ టాటర్‌స్థాన్‌లోని కజాన్ నుంచి సోచి సమీపంలోని రిసార్ట్ పట్టణం అడ్లెర్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.


వీడియోలు

రష్యా రాజధాని మాస్కోకు దక్షిణాన 1,200 కి.మీ దూరంలో ఉన్న దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొటెల్నికోవో స్టేషన్ సమీపంలో సుమారు 65 కి.మీ (40 mph) వేగంతో రైలు ట్రక్కును ఢీకొట్టిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 140 మందికి గాయాలు కాగా, ముగ్గురు పిల్లలతో సహా 15 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, కానీ రష్యా అధికారులు ఇంకా ధృవీకరించలేదని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. వీడియోలలో రైలు బోగీలు పట్టాలు తప్పినట్లుగా కనిపిస్తున్నాయి.


విచారణ ప్రారంభం

ఈ ప్రమాదం నేపథ్యంలో రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు వోల్గోగ్రాడ్ రీజియన్ గవర్నర్ ఆండ్రీ బోచారోవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రైలులో 813 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన అన్నారు. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతని తల, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఫైర్ అండ్ రెస్క్యూ వర్కర్లు సహాయక చర్యలు చేపడుతున్నారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ఏడాది జూన్‌లో కూడా రష్యాలోని కోమిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్యాసింజర్ రైలు 9 కోచ్‌లు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా గాయపడ్డారు. ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుంచి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం 5 వేల కిలోమీటర్లుగా ఉండేది.


ఇవి కూడా చదవండి:

Floods: వరదల్లో మునిగిన కిమ్ మామ కారు.. ఎమర్జన్సీ ప్రకటన


Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Read More international News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 08:27 PM

Advertising
Advertising
<