Pakistan On Modi: అందుకే శుభాకాంక్షలు చెప్పలేదు.. మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jun 08 , 2024 | 04:34 PM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందడం, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు..
లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందడం, ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కానీ.. దాయాది దేశమైన పాకిస్తాన్ (Pakistan) నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మోదీకి వాళ్లు శుభాకాంక్షలు తెలపలేదు. ఇందుకు గల కారణాలేంటన్న విషయంపై తాజాగా పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ (Mumtaz Zahra Baloch) స్పందించారు. భారత్‌లో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టే అభినందనలు తెలపలేదని క్లారిటీ ఇచ్చారు.
Read Also: దేశ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?
ఓ మీడియా సమావేశంలో ముంతాజ్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఎన్నికల ప్రక్రియపై మేం మాట్లాడానికి ఏమీ లేదు. అక్కడ ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి.. ఇప్పుడు అభినందనలు చెప్పడం తొందరపాటే అవుతుంది’’ అని అన్నారు. తమ సొంత నాయకత్వాన్ని నిర్ణయించుకోవడం భారత ప్రజల హక్కు అని నొక్కి చెప్పారు. భారత్‌తో పాటు ఇతర పొరుగు దేశాలతో పాక్ సత్సంబంధాలను కోరుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా.. జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర ప్రధాన వివాదాలను నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ చూస్తోందని పేర్కొన్నారు. దాయాది దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం కోసం.. అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు భారత్ తగిన చర్యలు తీసుకుంటుందమని ఆశిస్తున్నామని ముంతాజ్ చెప్పుకొచ్చారు.
Read Also: మోదీ ప్రధాని అవుతున్నా.. బీజేపీ బలహీనపడింది: మూడీస్
ఇదిలావుండగా.. 2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. భారత్ తీసుకున్న ఆ నిర్ణయం.. పొరుగు దేశాల మధ్య చర్చలు జరిపే పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని పాక్ ఆరోపించింది. అయితే.. భారత్ మాత్రం పాక్‌తో సత్సంబంధాలనే కోరుతూ వచ్చింది. ఆ దాయాది దేశంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని.. చర్చలకు తాము తలుపులు మూయలేదని చెప్తూ వస్తోంది. పాక్‌తో ఇతరత్రా సమస్యలు ఉన్నప్పటికీ.. అక్కడ పెద్ద సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలున్నాయి కాబట్టి ఉగ్రవాదంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని ఎస్ జైశంకర్ గతంలో వెల్లడించారు.
Read Latest International News and Telugu News
Updated Date - Jun 08 , 2024 | 04:34 PM