Share News

S Jaishankar: అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు.. కెనడాపై జైశంకర్ ఫైర్

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:40 PM

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైంశకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి కాన్‌బెర్రాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై దాడి ఘటనను ఎండగట్టారు.

S Jaishankar: అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు.. కెనడాపై జైశంకర్ ఫైర్

కాన్‌బెర్రా: కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై దాడి ఘటనను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తీవ్రంగా ఖండించారు. జస్టిస్ ట్రుడో నాయకత్వంలోని కెనడా (Canada) దేశంలో అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారని విమర్శించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైంశకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి కాన్‌బెర్రాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Canada: కెనడాలో భారతీయులపై అరాచకం.. రెచ్చిపోయిన ఖలిస్తానీ శక్తులు


బ్రాంప్టన్‌లో గత ఆదివారంనాడు హిందూ సభ టెంపుల్‌లో ఆలయ నిర్వాహకులు, ఇండియన్ కాన్సులేట్ ఏర్పాటు చేసిన కాన్సులర్ సమావేశంలో పాల్గొంటున్న వ్యక్తులపై ఖలిస్థాన్ అనుకూలవాదులు జైండా, కర్రలతో విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో భారత్ తీవ్ర స్థాయిలో ఖండించింది. దీనికి ముందు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా నిరాధార ఆరోపణలు చేయడం, భారత దౌత్యవేత్తలపై నిఘు ఉంచడం వంటి చర్యలకు దిగింది.


ఈ పరిణామాలపై జైశంకర్ మాట్లాడుతూ...''ముఖ్యంగా మూడు విషయాలు చెప్పదలచుకున్నాను. మెదటది.. కెనడా నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే పద్ధతిని పాటిస్తోంది. రెండవది.. మా విషయంలో భారత దౌత్యవేత్తలపై కెనడా నిఘా పెట్టింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మూడవది మనమంతా చూస్తున్న ఆలయం దాడి జరిగిన వీడియో సాక్ష్యం. వీటిని బట్టి చూస్తే అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తారని భావించాల్సి వస్తుంది'' అని జైశంకర్ పేర్కొన్నారు. ఈనెల 3న ఆస్ట్రేలియాలో జైశంకర్ చేపట్టిన పర్యటన 7వ తేదీతో ముగుస్తుంది.


ఇవి కూడా చదవండి..

US Election 2024: అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉన్నారంటే.. లేటెస్ట్ సర్వే ఇదే

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 05 , 2024 | 03:43 PM