ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Saudi Arabia: అమెరికాకు సౌదీ అరేబియా షాక్..50 ఏళ్ల ఒప్పందం రద్దు

ABN, Publish Date - Jun 14 , 2024 | 07:30 AM

అగ్రరాజ్యం అమెరికా(america)కు సౌదీ అరేబియా(Saudi Arabia) షాకిచ్చింది. అమెరికాతో 50 ఏళ్ల నాటి పెట్రో డాలర్ ఒప్పందాన్ని(petrodollar deal) పునరుద్ధరించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించింది. అయితే పెట్రోడాలర్ ఒప్పందం జూన్ 9తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Saudi Arabia cancels 50 year-old petrodollar deal usa

అగ్రరాజ్యం అమెరికా(america)కు సౌదీ అరేబియా(Saudi Arabia) షాకిచ్చింది. అమెరికాతో 50 ఏళ్ల నాటి పెట్రో డాలర్ ఒప్పందాన్ని(petrodollar deal) పునరుద్ధరించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించింది. అయితే పెట్రోడాలర్ ఒప్పందం జూన్ 9తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందాన్ని కొనసాగించకూడదని ఎంచుకోవడం ద్వారా సౌదీ అరేబియా ఇప్పుడు అమెరికా డాలర్లకు బదులుగా చైనీస్ యువాన్, యూరో యెన్ వంటి వివిధ కరెన్సీలను ఉపయోగించి చమురు, వివిధ వస్తువులను విక్రయించుకోవచ్చు. లావాదేవీల కోసం బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ఉపయోగించే చర్చ కూడా అందుబాటులో ఉంది.


పెట్రో డాలర్ డీల్ ఏంటీ?

పెట్రో డాలర్ ఒప్పందం(petrodollar deal) 1973 చమురు సంక్షోభం తర్వాత అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ తన చమురు ఎగుమతులపై యూఎస్ డాలర్లలో ధరను నిర్ణయించారు. ఆ క్రమంలో యూఎస్ ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు చమురు అమ్మకాల నుంచి అదనపు డబ్బును ఉపయోగిస్తారు. దీంతోపాటు అమెరికా దానికి బదులుగా సౌదీకి సైనిక సపోర్ట్, రక్షణను అందించింది.

ఈ ఒప్పందంలో సౌదీ తన ఆర్థిక, జాతీయ భద్రతను నిర్ధారిస్తుంది. ఆ క్రమంలో అమెరికా(america), సౌదీ మధ్య జూన్ 8, 1974న సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాకు ఆర్థిక సహకారం, సైనిక అవసరాల కోసం అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఆ సమయంలో అమెరికా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని ప్రోత్సహించడం, అరబ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంది.


అమెరికా- చైనా మధ్య

అయితే సౌదీకి రక్షణ కల్పిస్తామని, కాపాడుతామని అనేక ఏళ్లుగా చెబుతున్న అమెరికా భద్రతతో సౌదీ అంసతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సౌదీ చైనా(china)తో గత అనేక ఏళ్లుగా చర్చలు జరుపుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో US డాలర్ కాకుండా ఇతర కరెన్సీలను ఉపయోగించే ప్రపంచ ధోరణిని ఇది వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా డాలర్‌పై ప్రభావం చూపనుంది. ఇది అమెరికా డాలర్‌తో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనుంది. దీంతోపాటు అమెరికా- చైనా మధ్య కూడా పోటీ పెరగనుంది.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rate: గుడ్‌ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు


iPhones : ఐఫోన్లకూ జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీ హంగులు

Read Latest International News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 07:40 AM

Advertising
Advertising