ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress Manifesto: పేద మహిళకు ఏడాదికి లక్ష.. కాంగ్రెస్ వరాల జల్లు..

ABN, Publish Date - Mar 20 , 2024 | 03:48 AM

ప్రతి పేద కుటుంబంలోని ఓ మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు! విద్యావంతులైన యువతకు ఒక ఏడాదిపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల అప్రెంటిస్‌షిప్‌! రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ తొలగింపు!

  • యువతకు ఏడాదిపాటు రూ.లక్ష అప్రెంటిస్‌షిప్‌

  • రిజర్వేషన్లపై 50% సీలింగ్‌ తొలగింపు

  • కనీస వేతనం రోజుకు 400కు పెంపు

  • పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత

  • పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా చెల్లింపు

  • కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ

  • కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం ఏర్పాటు

  • ఆశ, అంగన్వాడీ కార్మికులకు

  • డబుల్‌ శాలరీ కాంట్రిబ్యూషన్‌

  • ఇంటింటికీ గ్యారెంటీ పేరిట కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో

  • ఐదు న్యాయాల్లో 25 గ్యారెంటీలకు చోటు

న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ప్రతి పేద కుటుంబంలోని ఓ మహిళకు(Women) ఏడాదికి లక్ష రూపాయలు! విద్యావంతులైన యువతకు(Students) ఒక ఏడాదిపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల అప్రెంటిస్‌షిప్‌! రిజర్వేషన్లపై(Reservation) 50 శాతం సీలింగ్‌ తొలగింపు! ఉపాధి హామీ సహా దేశవ్యాప్తంగా కనీస వేతనం రోజుకు రూ.400! శాశ్వత రుణ మాఫీ కమిషన్‌ ఏర్పాటు! శ్రామికులకు ఆరోగ్య హక్కు చట్టం! తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించనున్న హామీల్లో ఇవి కొన్ని మాత్రమే! మోదీ గ్యారెంటీలకు దీటుగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమ మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ‘ఐదు న్యాయాల’కు తుది రూపు ఇచ్చింది. ‘ఇంటింటికీ గ్యారెంటీ’ పేరిట రూపొందించిన ఐదు న్యాయాల్లో 25 హామీలను గుదిగుచ్చింది. పి.చిదంబరం నేతృత్వంలోని మ్యానిఫెస్టో కమిటీ రూపొందించిన ఐదు హామీలకు అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీడబ్ల్యూసీ సభ్యులు పల్లంరాజు, టి.సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, వంశీచంద్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మ్యానిఫెస్టోపై సీడబ్ల్యూసీ కూలంకషంగా మూడు గంటలపాటు చర్చించింది. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేపట్టిన రాహుల్‌ను అభినందిస్తూ తీర్మానం ఆమోదించింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. దేశం మార్పును కోరుకుంటోందని, 2004లో బీజేపీ ఇచ్చిన ‘ఇండియా షైనింగ్‌’ నినాదానికి పట్టిన గతే మోదీ గ్యారెంటీలకూ ఎదురువుతుందని విమర్శించారు. మ్యానిఫెస్టోకు వివిధ రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం లభించేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, నిబద్ధతతో ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కాంగ్రెస్‌ హామీలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేశామని జైరాం రమేశ్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సర్వసన్నద్ధంగా ఉందని కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ఇది మ్యానిఫెస్టో మాత్రమే కాదని, ప్రజలకు మంచి భవిష్యత్తును కల్పించేలా రూపొందించిన ‘న్యాయ పత్రమ’ని అభివర్ణించారు. ఐదు న్యాయాలు, పాతిక గ్యారెంటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. ‘ఘర్‌ ఘర్‌ గ్యారెంటీ’ పేరిట ఇంటింటికీ హామీలను తీసుకెళ్లాలని సంకల్పించామని చెప్పారు. మ్యానిఫెస్టోకు తుది ఆమోదం ఇవ్వడమే కాకుండా దాని విడుదలకు తేదీని నిర్ణయించే అధికారాన్ని అధ్యక్షుడు ఖర్గేకు సీడబ్ల్యూసీ కట్టబెట్టింది. అంతేనా.. దేశవ్యాప్తంగా పాత పింఛను పథకం అమలుకు మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని, రాజ్యాంగ సంస్థల స్వేచ్ఛను కాపాడడంతోపాటు వాటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి చట్టాన్ని తీసుకు రావాలని కూడా మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

హిస్సేదారి (సమానత్వ) న్యాయం

  • సామాజిక, ఆర్థిక కుల గణన

  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ తొలగింపు

  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కోసం స్పెషల్‌ బడ్జెట్‌

  • జల్‌ జంగల్‌ జమీన్‌పై చట్టబద్ధ హక్కులు

  • గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తింపు

నారీ (మహిళా) న్యాయం

  • మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు

  • ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్‌ శాలరీ కాంట్రిబ్యూషన్‌

  • మహిళల హక్కుల రక్షణ కోసం ప్రతి గ్రామంలో ‘అధికార మైత్రి’ ఏర్పాటు

  • వర్కింగ్‌ విమెన్‌ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టళ్ల సంఖ్య రెట్టింపు

కిసాన్‌ (రైతు) న్యాయం

  • స్వామినాథన్‌ ఫార్ములా ప్రకారం పంటల మద్ధతు ధరలకు చట్టబద్ధత

  • శాశ్వత రుణమాఫీ కమిషన్‌ ఏర్పాటు

  • పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ

  • రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం

  • వ్యవసాయ పరికరాలపై జీఎ్‌సటీ మినహాయింపు

శ్రామిక్‌ (కార్మికుల) న్యాయం

  • ఆరోగ్య హక్కు చట్టం అమలు. ఇందులో భాగంగా పరీక్షలు, మందులు, చికిత్సలు, శస్త్ర చికిత్సలు తదితరాలను పేర్కొంది.

  • రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం

  • పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు

  • అసంఘటిత రంగ కార్మికులకు జీవిత, ప్రమాద బీమా

  • ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల నిలుపుదల

యువ న్యాయం

  • భర్తీ భరోసా’ పథకం కింద కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ

  • యువతకు ఏడాదిపాటు అప్రెంటి్‌సషిప్‌ పథకం. ఏడాదిపాటు నెలకు రూ.8,500 చొప్పున లక్ష రూపాయల చెల్లింపు

  • పేపర్‌ లీకేజీలు అరికట్టేందుకు కఠినమైన చట్టం

  • గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు

  • స్టార్ట్‌పల ఏర్పాటుకు రూ.5000 కోట్ల నిధి కేటాయింపు

Updated Date - Mar 20 , 2024 | 07:19 AM

Advertising
Advertising