Aadhar For Dogs: కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?
ABN, Publish Date - May 04 , 2024 | 04:00 PM
ఎలాగైతే మనకు ‘ఆధార్’ అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్‌లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు?
ఎలాగైతే మనకు ‘ఆధార్’ (Aadhar Card) అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ (Aadhar For Dogs) ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్‌లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు? అని అనుకుంటున్నారా! దీని వెనుక ఓ కారణం ఉంది. ఈమధ్య కాలంలో కొందరు దుండగులు వీధి కుక్కలపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ సరదా కోసం.. వాటిని కొట్టడమో, చంపడమో చేస్తున్నారు. ఈ ముప్పు నుంచి వీధి కుక్కల్ని తప్పించడం కోసమే.. ఓ స్వచ్ఛంధ సంస్థ ‘ఆధార్ కార్డ్’ ఐడియాతో ముందుకొచ్చింది. వాటి సంరక్షణ కోసం.. ఈ పరిష్కార మార్గాన్ని తెరమీదకి తెచ్చింది.
అమెరికా జట్టులో భారత ఆటగాళ్లు.. మనతోనే పోటీ
‘Pawfriend.in’ అనే ఒక ఎన్జీవో.. కుక్కల కోసం ఈ ఆధార్ కార్డ్‌లను తయారు చేయించింది. ఢిల్లీ టర్మినల్ ఎయిర్‌పోర్ట్, ఇండియా గేట్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని 100 కుక్కలకు.. క్యూఆర్ కోడ్స్‌తో కూడిన ఈ కార్డ్స్‌ని ఆ స్వచ్ఛంద సంస్థ జారీ చేసింది. వాటి మెడలో ఈ కార్డ్‌లను వేశారు. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే.. ఆ కుక్క ఏ వీధికి చెందిందో తెలుస్తుంది. కుక్కలకు గాయమైనప్పుడో లేక తప్పిపోయినప్పుడో ఆ కోడ్‌ని స్కాన్ చేసి, ఆ ఏరియా అధికారులకు సమాచారం అందించొచ్చు. అలాగే.. శునకాలు అనుకోకుండా తప్పిపోయినా, వాటిని ట్రాక్ చేసేందుకు కూడా ఈ ఆధార్ కార్డ్స్ పనికొస్తాయని అధికారులు చెప్తున్నారు. వీధి కుక్కలకు ఇదొక లైఫ్‌లైన్ అని.. యానిమల్ యాక్టివిస్ట్ మానవి రవి వెల్లడించారు.
అదే ముంబై ఇండియన్స్ కొంపముంచింది
కేవలం ఢిల్లీలోనే కాదండోయ్.. ముంబైలోనూ అక్షయ్ రిడ్లాన్ అనే ఓ ఇంజినీర్ వీధి కుక్కల వివరాలతో కూడిన డిజిటల్ క్యూఆర్ కోడ్ వ్యవస్థను రూపొందించాడు. ముంబై పరిసర ప్రాంతాల్లో సంచరించే 20 వీధి కుక్కల మెడలో క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లను తగిలించాడు. ఆ కోడ్‌ని స్కాన్ చేయగానే.. సదరు కుక్క పేరుతో పాటు అది ఉండే ప్రదేశం, దాని యజమాని, వ్యాక్సినేషన్ రికార్డ్స్, వైద్య చరిత్ర వంటి వివరాలు వచ్చేస్తాయి. వీధి కుక్కలు తప్పిపోతే.. తిరిగి సొంత గూటికి చేర్చేందుకే ఆ ఇంజినీర్ ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టాడు. తనకు మంచి అనుబంధం ఉండే ‘కాలూ’ అనే కుక్క తప్పిపోవడం వల్లే.. అతనికి ఆ ఆలోచన తట్టింది.
Read Latest National News and Telugu News
Updated Date - May 04 , 2024 | 04:00 PM