Share News

Aadhar For Dogs: కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?

ABN , Publish Date - May 04 , 2024 | 04:00 PM

ఎలాగైతే మనకు ‘ఆధార్’ అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్‌లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు?

Aadhar For Dogs: కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?

ఎలాగైతే మనకు ‘ఆధార్’ (Aadhar Card) అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ (Aadhar For Dogs) ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్‌లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు? అని అనుకుంటున్నారా! దీని వెనుక ఓ కారణం ఉంది. ఈమధ్య కాలంలో కొందరు దుండగులు వీధి కుక్కలపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ సరదా కోసం.. వాటిని కొట్టడమో, చంపడమో చేస్తున్నారు. ఈ ముప్పు నుంచి వీధి కుక్కల్ని తప్పించడం కోసమే.. ఓ స్వచ్ఛంధ సంస్థ ‘ఆధార్ కార్డ్’ ఐడియాతో ముందుకొచ్చింది. వాటి సంరక్షణ కోసం.. ఈ పరిష్కార మార్గాన్ని తెరమీదకి తెచ్చింది.


అమెరికా జట్టులో భారత ఆటగాళ్లు.. మనతోనే పోటీ

Pawfriend.in’ అనే ఒక ఎన్జీవో.. కుక్కల కోసం ఈ ఆధార్ కార్డ్‌లను తయారు చేయించింది. ఢిల్లీ టర్మినల్ ఎయిర్‌పోర్ట్, ఇండియా గేట్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని 100 కుక్కలకు.. క్యూఆర్ కోడ్స్‌తో కూడిన ఈ కార్డ్స్‌ని ఆ స్వచ్ఛంద సంస్థ జారీ చేసింది. వాటి మెడలో ఈ కార్డ్‌లను వేశారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేస్తే.. ఆ కుక్క ఏ వీధికి చెందిందో తెలుస్తుంది. కుక్కలకు గాయమైనప్పుడో లేక తప్పిపోయినప్పుడో ఆ కోడ్‌ని స్కాన్ చేసి, ఆ ఏరియా అధికారులకు సమాచారం అందించొచ్చు. అలాగే.. శునకాలు అనుకోకుండా తప్పిపోయినా, వాటిని ట్రాక్ చేసేందుకు కూడా ఈ ఆధార్ కార్డ్స్ పనికొస్తాయని అధికారులు చెప్తున్నారు. వీధి కుక్కలకు ఇదొక లైఫ్‌లైన్ అని.. యానిమల్ యాక్టివిస్ట్ మానవి రవి వెల్లడించారు.

అదే ముంబై ఇండియన్స్ కొంపముంచింది

కేవలం ఢిల్లీలోనే కాదండోయ్.. ముంబైలోనూ అక్షయ్ రిడ్లాన్ అనే ఓ ఇంజినీర్ వీధి కుక్కల వివరాలతో కూడిన డిజిటల్‌ క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థను రూపొందించాడు. ముంబై పరిసర ప్రాంతాల్లో సంచరించే 20 వీధి కుక్కల మెడలో క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌లను తగిలించాడు. ఆ కోడ్‌ని స్కాన్‌ చేయగానే.. సదరు కుక్క పేరుతో పాటు అది ఉండే ప్రదేశం, దాని యజమాని, వ్యాక్సినేషన్‌ రికార్డ్స్, వైద్య చరిత్ర వంటి వివరాలు వచ్చేస్తాయి. వీధి కుక్కలు తప్పిపోతే.. తిరిగి సొంత గూటికి చేర్చేందుకే ఆ ఇంజినీర్ ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టాడు. తనకు మంచి అనుబంధం ఉండే ‘కాలూ’ అనే కుక్క తప్పిపోవడం వల్లే.. అతనికి ఆ ఆలోచన తట్టింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 04 , 2024 | 04:00 PM