Teenage Suicide: ఈ ఏడాది 17వ విద్యార్థి సూసైడ్.. కోటాలో ఏం జరుగుతోంది..
ABN, Publish Date - Dec 21 , 2024 | 06:05 PM
రాజస్థాన్‌లో కోటాలో మరో ఐఐటీ జేఈఈ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం విద్యార్థిన తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇది ఆత్మహత్యగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాజస్థాన్(Rajasthan)లోని కోటాలో ఓ 16 ఏళ్ల ఐఐటీ జేఈఈ విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం విద్యార్థి తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. విచారణ కొనసాగుతోందని, విద్యార్థి మృతి చెందడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే కోటాలో కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో ఆత్మహత్య చేసుకున్న వాటిలో ఇది 17వ కేసు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఇదే నగరంలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు 26 నమోదయ్యాయి.
సీలింగ్ ఫ్యాన్‌కు
కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన హాస్టల్ గదిలో విద్యార్థి మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతుడు 11వ తరగతి చదువుతున్నాడని, బీహార్‌లోని వైశాలి జిల్లా వాసి అని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ముఖేష్ మీనా మీడియాకు తెలిపారు. గదిలో ఆత్మహత్య నిరోధక పరికరాన్ని అమర్చగా, బాలుడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. గత ఏడాది విద్యార్థుల ఆత్మహత్యల కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) నివాసాలకు గదుల్లో స్ప్రింగ్‌లోడెడ్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఈ ఏడాది 17వ ఆత్మహత్య కేసు
ఈ ఘటనల నేపథ్యంలో కోటా జిల్లా యంత్రాంగం, రాజస్థాన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, కోటాలో మాత్రం విద్యార్థుల ఆత్మహత్య కేసులు ఆగడం లేదు. తప్పనిసరి స్క్రీనింగ్ పరీక్షలు, ర్యాంకింగ్ ఆధారిత క్రమబద్ధీకరణకు బదులు విద్యార్థులను అక్షర క్రమంలో క్రమబద్ధీకరించడం అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని గుర్తించింది. జనవరిలో కేంద్ర విద్యా మంత్రి కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలను జారీ చేశారు. వాటిని 16 ఏళ్లు పైబడిన విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని, ఉల్లంఘనకు పాల్పడితే రూ. 1,00,000 జరిమానా విధిస్తామని ప్రకటించారు.
కామెంట్లు
విద్యార్థులు మాత్రం కోచింగ్ సెంటర్లు పెట్టే ర్యాంకుల ఒత్తిడి కారణంగానే మరణిస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రోజువారీ చదువు, హోంవర్క్ వంటివి తప్పనిసరి చేస్తూ కఠిన రూల్స్ పెట్టడం వల్లనే అనేక మంది విద్యార్థులు తట్టుకోవడం లేదని అంటున్నారు. అయితే ఈ సూసైడ్‌ల విషయంలో మీరు ఏమనుకుంటున్నారో అభిప్రాయం రూపంలో తెలియజేయండి మరి.
ఇవి కూడా చదవండి:
GST Council: జీవిత, ఆరోగ్య బీమాపై పన్ను తగ్గింపు నిర్ణయంలో ట్విస్ట్.. ఈసారి కూడా..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 21 , 2024 | 06:08 PM