Exit Polls: ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయేదే హవా
ABN, Publish Date - Nov 20 , 2024 | 07:14 PM
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో బీజేపీ..దాని మిత్ర పక్షాలదే హవా అని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
హైదరాబాద్, నవంబర్ 20: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. దీంతో ఆయా రాష్ట్రాల ఓటర్లు ఏ పార్టీలకు పట్టం కట్టబోతున్నారనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెలువరించాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు.. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలకే జై కొట్టారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అంటే.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమిదే అధికారమని వెల్లడించాయి. ఇక మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలు.. మొత్తం 288
చాణక్య సర్వే:
ఎన్‌డీఏ: 152 -160 స్థానాలు
ఇండియా కూటమి: 130 - 138 స్థానాలు
పీపుల్స్ పల్స్:
ఎన్డీయే 175 - 195
ఇండియా కూటమి: 85 -112
ఏబీపీ మాట్రైజ్ సర్వే:
బీజేపీ:150 - 170 స్థానాలు
కాంగ్రెస్ పార్టీ:110 130 స్థానాలు
ఇతరులు: 8- 10 స్థానాలు
రిపబ్లిక్ పీమార్క్:
ఎన్డీయే: 137-157 స్థానాలు
ఇండియా కూటమి 126 -146 స్థానాలు
న్యూస్ 18:
ఎన్డీయే : 154
ఇండియా కూటమి 128
ఇతరులు: 06
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి.
చాణక్య:
ఎన్డీయే 45 - 50
ఇండియా కూటమి : 35 - 38
పీపుల్స్ పల్స్:
ఎన్డీయే 42- 48
జేఎంఎం : 16- 23
కాంగ్రెస్ పార్టీ: 8 -14
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఒకే సారి విడుదల చేసింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతలుగా... నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ నిర్వహింస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఆ క్రమంలో ఈ ఇరు రాష్ట్రాల అసెంబ్లీలకు బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్.. తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలదే హవా అని స్పష్టం చేశాయి.
మరోవైపు.. మహారాష్ట్రలో ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే), కాంగ్రెస్ పార్టీల భాగస్వామ్యతో మహా వికాస్ అఘాడీ ఏర్పాటు కాగా.. ఇక ఎన్సీపీ (అజిత్ పవార్) శివసేన (షిండే), బీజేపీ పార్టీలతో మహాయుతి కూటమి ఏర్పాటు అయింది. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీ కూటముల మధ్యే ప్రధాన పోరు జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీకే పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జత కట్టి బీజేపీ ఈ ఎన్నికలకు వెళ్లింది. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా బరిలో నిలిచాయి. బిహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పాటు అయింది. నాటి నుంచి నేటి వరకు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజార్టీ మాత్రం రాలేదు. మిత్రపక్షాల సహకారంతోనే జార్ఖండ్‌లో ప్రభుత్వాలు కొలువు తీరాయి. అయితే ఒకరు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులంతా ఐదేళ్ల పూర్తిగా పని చేయక పోవడం గమనార్హం.
For National News And Telugu News
Updated Date - Nov 20 , 2024 | 07:47 PM