మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mumbai: పాపం పసికూనలు.. ఆడుకోవడానికి కారెక్కి.. కానరాని లోకాలకు

ABN, Publish Date - Apr 25 , 2024 | 06:35 PM

పిల్లలపై అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూపే అలసత్వమే కొంప ముంచుతుంది. వారిని క్షణం కంటకనిపెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. చిన్నారుల ప్రాణాలు కోల్పేయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం జరిగింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది.

Mumbai: పాపం పసికూనలు.. ఆడుకోవడానికి కారెక్కి.. కానరాని లోకాలకు

ముంబై: పిల్లలపై అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూపే అలసత్వమే కొంప ముంచుతుంది. వారిని క్షణం కంటకనిపెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. చిన్నారుల ప్రాణాలు కోల్పేయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లో బుధవారం జరిగింది.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంటోప్ హిల్ వద్ద ఓ కారు పార్క్ చేసి ఉంది. పక్కనే ఉన్న ఇంట్లో నుంచి ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకోవడానికి బయటకి వచ్చారు. కారు కనిపించేసరికి అందులోకి ఎక్కారు. ఈ క్రమంలోనే కారు డోర్లన్నీ లాక్ అయ్యాయి.


అద్దాలు కూడా తెరిచి లేకపోవడంతో.. చిన్నారుల అరుపులు బయటకి వినిపించలేదు. దీంతో ఊపిరాడని చిన్నారులు అపస్మారక స్థితిలోకి చేరుకుని కారులో విగత జీవులుగా మారారు. సాయంత్రం అయినా చిన్నారులు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు వెతకసాగారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కారువైపు నుంచి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అందులో చిన్నారులు ఉండటాన్ని గుర్తించాడు.


సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశాడు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు అచేతనంగా పడి ఉన్న చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. చిన్నారులను కోల్పోయిన బాధతో తల్లిదండ్రుల రోదనలు అరణ్యవేదనలా మారాయి.

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

కారు లాక్ పడటంతోనే ఊపిరాడక చనిపోయారని పోలీసులు చెప్పారు. ఘటనాస్థలిలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని.. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 06:35 PM

Advertising
Advertising