ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MHA: జమ్మూలో ఈ ఏడాది ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లలో 28 మంది మంది మృతి

ABN, Publish Date - Jul 30 , 2024 | 05:42 PM

జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జూలై 21 వరకూ 11 ఉగ్రదాడుల ఘటనలు, 24 ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది, పౌరులు సహా 28 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు లోక్‌సభలో తెలిపింది.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జూలై 21 వరకూ 11 ఉగ్రదాడుల ఘటనలు, 24 ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది, పౌరులు సహా 28 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) మంగళవారంనాడు లోక్‌సభలో తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ (Nityanand Rai) లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.


ఈ ఏడాది జూలై 21వ తేదీ వరకు 14 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మృతి చెందారని, గత ఏడాది 46 ఉగ్రవాద ఘటనలు, 48 ఎన్‌కౌంటర్లలో 30 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 2018లో జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 229 టెర్రరిస్ట్-ఇనీషియేటెడ్ ఇన్సిడెంట్లు, 189 ఎన్‌కౌంటర్లు, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లలో 146 మంది (91 మంది భద్రతా సిబ్బంది, 55 మంది పౌరులు) మరణించారని చెప్పారు. అదే ఏడాది 1328 రాళ్ల రువ్వుడు ఘటనలు, 52 ఆర్గనైజ్డ్ హర్తాళ్‌లు జరిగాయని మంత్రి వివరించారు.

UPSC aspirants deaths: ఇప్పటికీ 12 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదు...ఎంపీ సంచలన వ్యాఖ్య


ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్'

ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ఉగ్రవాద ఘటనలు జమ్మూకశ్మీర్‌లో తగ్గుముఖం పట్టాయని నిత్యానంద రాయ్ చెప్పారు. శాంతి, సుస్ధిరతల కోసం భద్రతా చర్యలు పటిష్టమయ్యాయమని సభకు వివరించారు. ఉగ్రనిధులపై విరుచుకుపడటం, టెర్రరిస్టులు, వారి అసోసియేట్లకు చెందిన ఆస్తుల జప్తు, సంఘ వ్యతిరేక సంస్థలపై నిషేధం, చొరబాట్ల నిరోధానికి బహుళ అంచెల వ్యూహం అమలు, అధునాతన భద్రతా సామగ్రి సమకూర్చడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. తద్వారా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచివేసేందుకు కీలక చర్యలు తీసుకుందని వివరించారు. వీటితో పాటు ఉగ్ర సంస్థల సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక పాయింట్ల వద్ద నిరంతర గస్తీ, ముమ్మర గాలింపు చర్యలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 05:42 PM

Advertising
Advertising
<