Paris Tour: ప్రజాధనంతో ప్యారిస్‌లో అధికారుల చక్కర్లు
ABN, Publish Date - Apr 11 , 2024 | 07:17 PM
ప్రజాధనంతో చండీగఢ్ అధికారులు జోరుగా షికార్లు చేశారు. ప్యారిస్ టూర్ వెళ్లి తెగ ఎంజాయ్ చేశారు. ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకొని వెళ్లారు. ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌లో బస చేశారు. ఆ సమయంలో ఖర్చు గురించి ఆలోచించలేదు. ముగ్గురు అధికారులు కలిసి ప్రజాధనాన్ని దుబారా చేశారు.
చండీగఢ్: ప్రజాధనంతో చండీగఢ్ (Chandigarh) అధికారులు జోరుగా షికార్లు చేశారు. ప్యారిస్ టూర్ వెళ్లి తెగ ఎంజాయ్ చేశారు. ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకొని వెళ్లారు. ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌లో బస చేశారు. ఆ సమయంలో ఖర్చు గురించి ఆలోచించలేదు. ముగ్గురు అధికారులు కలిసి ప్రజాధనాన్ని దుబారా చేశారు. పంజాబ్ గవర్నర్‌గా కెప్టెన్ సింగ్ సోలంకి అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో చండీగఢ్ పరిపాలన సలహాదారునిగా విజయ్ దేవ్, హోం సెక్రటరీగా అనురాగ్ అగర్వాల్, సెక్రటరీగా విక్రంత్ దేవ్ ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో అధికారుల దుబారా ఖర్చు గురించి తెలిసింది.
POK: పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఏం జరిగిందంటే..?
చండీగఢ్ కోసం స్విస్-ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లే కార్బుసియర్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఆ సంస్థ 50వ వార్షికోవత్సం సందర్భంగా పారిస్‌లో వార్షికోత్సవం చేశారు. కార్యక్రమానికి రావాలని చండీగఢ్ ప్రభుత్వానికి ఆహ్వానం పంపించారు. వాస్తవానికి చండీగఢ్ ఆర్కిటెక్ట్ విభాగానికి ఆహ్వానం వచ్చింది. ఆ స్థానంలో ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులు వెళ్లారు. విజయ్ దేవ్, విక్రమ్ దేవ్ దత్, అనురాగ్ అగర్వాల్ వెళ్లేందుకు హోం శాఖ కూడా అనుమతి ఇచ్చింది. ప్యారిస్ వెళ్లేందుకు ఒకరికొకరు ఆమోదం తెలుపుకుని ఏం చక్కా తిరిగొచ్చారు. ఆ ముగ్గురి పర్యటన కోసం రూ. 18 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చారు. అధికారులు మాత్రం రూ.25 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మంజూరు చేసిన మొత్తం కన్నా 40 శాతం ఎక్కువ దుబారా చేశారు.
ఇవి కూడా చదవండి:
PM Modi: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం: ప్రధాని మోదీ
LokSabha Elections: దక్షిణాదిలో పాగా వేస్తాం
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 11 , 2024 | 07:27 PM