ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం.. గత ఏడాది దీనిని ఆవిష్కరించిన మోదీ

ABN, Publish Date - Aug 26 , 2024 | 06:13 PM

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది అట్టహాసంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ (Sivaji Maharaj) 35 అడుగుల ఎత్తైన విగ్రహం సోమవారంనాడు కుప్పకూలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్‌లోని ఈ విగ్రహం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది అట్టహాసంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ (Sivaji Maharaj) 35 అడుగుల ఎత్తైన విగ్రహం సోమవారంనాడు కుప్పకూలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్‌లోని ఈ విగ్రహం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. విగ్రహం కూలిపోవడానికి ఇతమిత్ధమైన కారణం తెలియలేదు. అయితే, గత రెండు మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఇందుకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. సీనియర్ అధికారులు, జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకోగా, విగ్రహం కూలిపోవడానికి కారణాలు, ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై నిపుణుల అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది డిసెంబర్ 4న 'నేవీ డే' సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజ్‌కోట్ ఫోర్ట్‌లో జరిగిన వేడుకల్లో సైతం పాల్గొన్నారు.


ప్రభుత్వానిదే బాధ్యత: విపక్షాలు

శివాజీ మహరాజ్ 35 అడుగుల విగ్రహం కుప్పకూలడానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఎన్‌సీపీ (ఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయత్ పటేల్ ఆరోపించారు. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని, కేవలం ప్రధానమంత్రితో విగ్రహావిష్కరణ చేయించడం పైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. కొత్త టెండర్లు పిలవడం, కమిషన్లు తీసుకుని కాంట్రాక్టులు ఇవ్వడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. కాగా, విగ్రహ నిర్మాణంలో నాసిరకం ప్రమాణాలు పాటించినట్టు శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే వైభవ్ నాయక్ ఆరోపించారు. బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని, విగ్రహ నిర్మాణం, ఏర్పాటు చేసిన వ్యక్తులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

Kangana Ranaut: ఎంపీ కంగనా రనౌత్‌కు ఊహించని షాకిచ్చిన సొంత పార్టీ బీజేపీ


మంత్రి స్పందన..

కాగా, ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిన ఘటనపై సమగ్ర సమాచారం తనకు తెలియదని మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. అయితే, ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని సింధుదుర్గ్ గార్డియన్ మినిస్టర్‌గా కూడా ఉన్న పీడబ్ల్యూడీ మంత్రి రవీంద్ర చవాన్ చెప్పినట్టు వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2024 | 06:13 PM

Advertising
Advertising
<