Stampede: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 9 మందికి గాయాలు
ABN, Publish Date - Aug 12 , 2024 | 07:36 AM
ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అనేక మంది ఒక్కసారిగా ఒకరిపై ఒకరుపడగా, వారి నుంచి ఇంకొంత మంది భక్తులు దూసుకెళ్లారు. దీంతో ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మరణించగా, మరో 9 మందికి గాయాలయ్యాయి.
ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అనేక మంది ఒక్కసారిగా ఒకరిపై ఒకరుపడగా, వారి నుంచి ఇంకొంత మంది భక్తులు దూసుకెళ్లారు. దీంతో ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మరణించగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన బీహార్(Bihar) జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయం(Baba Siddhnath temple)లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బాబా సిద్ధనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నామని జెహనాబాద్ డీఎం అలంకృత పాండే తెలిపారు. మరణించిన కుటుంబ సభ్యులను కలిసి విచారిస్తున్నామని, దీంతోపాటు మరికొంత మంది మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అలంకృత పాండే అన్నారు. ఘటనా స్థలాన్ని డీఎం, ఎస్పీ సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు జెహనాబాద్ ఎస్‌హెచ్‌ఓ దివాకర్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. సిద్ధనాథ్ ఆలయం వద్ద ఉన్న కొండపైకి ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మృతులు, క్షతగాత్రుల కుటుంబాలతో అధికారులు మాట్లాడుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆసరా అందించడంతోపాటు సరైన విధానాలు పాటించేలా చూడడంపై దృష్టి సారించారు. అయితే తొక్కిసలాటకు గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. గందరగోళాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి:
Alert: దంచికొడుతున్న వర్షాలు గత 24 గంటల్లో 28 మంది మృతి.. IMD హెచ్చరిక
Delhi : ఆరోపణలు పచ్చి అబద్ధాలు
District Magistrate : లోపాలకు అధికారులే బాధ్యులు..
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 12 , 2024 | 07:53 AM