Accident: ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 18 మందికి గాయాలు
ABN, Publish Date - Sep 16 , 2024 | 07:41 AM
ప్రయాణికులతో ఉన్న తుఫాన్ వాహనానికి ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో తుఫాన్ వాహనం ఆకస్మాత్తుగా వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషాధ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని సిరోహి జిల్లా(sirohi) పిండ్వారా ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తుఫాన్ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీప్ పూర్తిగా ప్రయాణికులతో లోడ్ అయి ఉంది.
కారణమిదే
పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించి జీపులో ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ అన్నారు. ఉదయపూర్-పాలన్‌పూర్ హైవేపై పిండ్వారా కంటల్ పులియా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కంటల్ సమీపంలోకి రాగానే ఆ జీప్ ట్రక్కును ఢీకొట్టిందన్నారు. ఆ క్రమంలో వాహనం పూర్తిగా ధ్వంసమైందన్నారు. అక్కడ చాలా మంది చిక్కుకుపోయారని, వారిని స్థానికుల సహకారంతో బయటకు తీశామని వెల్లడించారు. అయితే ఆ తుఫాన్ వాహనం రాంగ్ రూట్‌లో వెళ్లిన క్రమంలోనే యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు.
ప్రమాదంలో 18 మంది
ఎస్పీ తెలిపిన ప్రకారం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. దీంతో పాటు 18 మంది గాయపడ్డారు. మృతులంతా జీప్ (తుఫాన్ క్రూజర్)లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముందు కూడా..
అంతకుముందు బుండి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈకో కారులో ప్రయాణిస్తున్న 6 మంది మరణించారు. కాగా ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి, అక్కడి నుంచి కోటాకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి సికార్‌లో ఖతు శ్యామ్ ఆలయానికి దర్శనానికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని బండి ఎస్పీ హనుమాన్ ప్రసాద్ మీనా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Local Media : ‘శంకర్ దాదా.. ఎంబీబీఎస్’లు!
Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..
Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read More National News and Latest Telugu News
Updated Date - Sep 16 , 2024 | 07:59 AM