మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆరో దశ బరిలో 92 మంది మహిళలు

ABN, Publish Date - May 17 , 2024 | 05:18 AM

లోక్‌సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) విశ్లేషించింది.

ఆరో దశ బరిలో   92 మంది మహిళలు

న్యూఢిల్లీ, మే 16 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) విశ్లేషించింది. ఆ వివరాలను గురువారం వెల్లడించింది.

866 మందిలో 338 మంది (39ు) కోటీశ్వర్లున్నారు. బీజేపీ తరఫున హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బరిలోకి దిగిన నవీన్‌ జిందాల్‌కు అత్యధికంగా రూ.1,241 కోట్ల ఆస్తులున్నాయి. అభ్యర్థులందరి సగటు ఆస్తులు రూ.6.21 కోట్లుగా ఉన్నాయి.

ఇక మహిళా అభ్యర్థులు 11శాతం ఉన్నారు. 180 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు, 141 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నా యి. 12 మంది వివిధ కేసుల్లో దోషులుగా తేలారు.

ఆరుగురు తమపై హత్యకేసులు, 21మంది తమపై హత్యాయత్నం కేసులున్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. మహిళలపై దాడులకు సంబంధించి 24 మందిపై కేసులు నమోదు కాగా వారిలో ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. విద్వేష ప్రసంగాలు చేసినందుకు 16 మందిపై కేసులు నమోదయ్యాయి.

ఇక విద్యార్హతల విషయానికొస్తే 332 మంది ఐదు నుంచి 12వ తరగతి వరకు చదువుకోగా, 487 (56ు) మంది డిగ్రీ, ఆపై ఉన్నత విద్యను అభ్యసించారని ఏడీఆర్‌ పేర్కొంది. ఆరో దశ ఎన్నికలు ఈనెల 25వ తేదీన జరగను

Updated Date - May 17 , 2024 | 05:18 AM

Advertising
Advertising