Share News

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:21 AM

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇప్పటివరకు 2.85 కోట్ల మంది భక్తులు వచ్చారు. కోట్లాది రూపాయల విరాళాలు అందాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంతేకాదు ఓ భక్తుడు 2100 కోట్ల రూపాయల చెక్కు కూడా ఇచ్చారని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..
Ayodhya Ram Mandir

అయోధ్య(Ayodhya)లో రామమందిరానికి(Ram Mandir) విరాళాలు(donations) వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్క ఏడాదిలోనే రూ.363 కోట్ల విరాళాలు అందాయి. విదేశాల్లో నివసిస్తున్న రామభక్తులు రాంలాలాకు రూ.10.43 కోట్లు పంపించారు. చెక్కు, నగదు రూపంలో శ్రీరామ్‌కు రూ.53 కోట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ లాల్లా ముందు ఉంచిన విరాళాల పెట్టెల నుంచి రూ. 24.50 కోట్లు వచ్చాయి. తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివిధ ఖాతాలలో రూ. 71 కోట్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇదొక్కటే కాదు బ్యాంకులో రూ.2,600 కోట్లు ఎఫ్‌డీల రూపంలో ఉన్నట్లు కూడా ట్రస్ట్ నిర్వహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు ఉన్న ఆదాయ, వ్యయాల ఖాతాలను ఆగస్టు 22న ప్రకటించింది.


అభివృద్ధికి అదనంగా

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు రామ మందిర నిర్మాణానికి రూ.670 కోట్లు వెచ్చించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. రామజన్మభూమి కాంప్లెక్స్ అభివృద్ధికి అదనంగా రూ.180 కోట్లు వెచ్చించాలని అంచనా వేసినట్లు చెప్పారు. సమావేశంలో ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు నృపేంద్ర మిశ్రా పాల్గొన్నారు.


2100 కోట్ల చెక్కు

అంతేకాదు ఇటివల రామ్ మందిర్ ట్రస్టుకు పోస్ట్ ద్వారా రూ. 2100 కోట్ల చెక్కు వచ్చిందని తెలిపారు. అది చూసిన నిర్వహకులు ఆశ్చర్యపోయారు. ఆ క్రమంలో దానిని విపులంగా చెక్ చేశారు. ఆ క్రమంలో దానిపై పంపించిన వ్యక్తి పేరు, ఫోన్ నంబర్, చిరునామా కూడా సరిగ్గానే ఉంది. కానీ దానిని పంపించిన వారు మాత్రం ప్రధానమంత్రి సహాయ నిధి పేరుతో ఆ చెక్కును ట్రస్ట్‌కు పంపించారు. దీంతో ఆ చెక్కును తిరిగి పీఎం సహాయనిధికి పంపించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆ చెక్కు గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు పీఎం కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు.


ఏడు నెలల్లో

రాంలాలా శంకుస్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 7 నెలల్లో 2 కోట్ల 85 లక్షల మంది భక్తులు రాంలాలాను దర్శించుకున్నారు. శ్రావణ మాసంలో 35 లక్షల మంది భక్తులు వచ్చారు. అంటే ప్రతిరోజూ దాదాపు 1.30 లక్షల మంది భక్తులు రాంలాలా దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు రాత్రి, పగలు తేడా లేకుండా ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రామమందిరం మొదటి అంతస్తులో టైటానియం రామ్ దర్బార్ నిర్మించనున్నారు.


ఆలయ ఖర్చు

ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.1800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 60 శాతం ఖర్చు గోడకే ఖర్చు కానుంది. అందువల్ల రామాలయంలో అత్యంత ఖరీదైన భాగం దాని గోడ అవుతుంది. రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ 90 శాతం పూర్తయింది. రెండో అంతస్తు పనులు కూడా 70 శాతం పూర్తయ్యాయి. రెండో అంతస్తులో 74 పిల్లర్లలో 60 అమర్చారు. క్యాంపస్‌లో 800 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మిస్తున్నారు.


ముగ్గురు శిల్పులకు

2023-24లో రాంలాలాకు 13 క్వింటాళ్ల వెండి, 20 కిలోల బంగారాన్ని సమర్పించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాంలాలా విగ్రహాన్ని తయారు చేసిన ముగ్గురు శిల్పులకు 18% జీఎస్టీతో పాటు రూ.75. 75 లక్షలు అందించినట్లు చెప్పారు. 37 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని రాంలాలా ముడుపులో ఏర్పాటు చేశారు. మరో శిల్పి గణేష్ భట్ కర్ణాటక రాష్ట్రంలో అనేక అవార్డులు అందుకున్నారు. మూడవ శిల్పి సత్యనారాయణ్ పాండే, జైపూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి రామేశ్వర్ లాల్ పాండే కుమారుడు.


ఇవి కూడా చదవండి:

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి

Maternity Leaves: ఈ మహిళలకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులు.. సీఎం కీలక ప్రకటన


Health Department : స్నాతకోత్సవాల కోసం భారతీయ దుస్తులు


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 11:22 AM