ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Max Pet Hospital : ఢిల్లీలో కుక్కకు అరుదైన గుండె ఆపరేషన్‌

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:00 AM

గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ కుక్కకు ఢీల్లీ పశువైద్యులు అరుదైన ఆపరేషన్‌ నిర్వహించి దాని ప్రాణాలు కాపాడారు. ఢిల్లీలోని మాక్స్‌ పెట్‌ హాస్పిటల్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్‌ భాను దేవ్‌ శర్మ మాట్లాడుతూ, బీగిల్‌ జాతికి చెందిన ఏడేళ్ల కుక్క జూలియట్‌ కొన్నాళ్లుగా మైట్రల్‌ వాల్వ్‌ జబ్బుతో బాధపడుతోందని తెలిపారు.

  • భారత్‌లో తొలిసారి విజయవంతంగా నిర్వహించిన వైద్యులు

న్యూఢిల్లీ, జూన్‌ 2: గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ కుక్కకు ఢీల్లీ పశువైద్యులు అరుదైన ఆపరేషన్‌ నిర్వహించి దాని ప్రాణాలు కాపాడారు. ఢిల్లీలోని మాక్స్‌ పెట్‌ హాస్పిటల్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్‌ భాను దేవ్‌ శర్మ మాట్లాడుతూ, బీగిల్‌ జాతికి చెందిన ఏడేళ్ల కుక్క జూలియట్‌ కొన్నాళ్లుగా మైట్రల్‌ వాల్వ్‌ జబ్బుతో బాధపడుతోందని తెలిపారు. దీని వల్ల గుండె నుంచి దేహంలోని కణాలకు రక్త సరఫరా చేసే వాల్వు మూసుకుపోయి రక్తం తిరిగి వెనుకకు వస్తోందని చెప్పారు.

ఈ ప్రక్రియ కొనసాగితే కొన్ని రోజులకు గుండె కొట్టుకోవడం ఆగిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. మే 30న కుక్కకు ‘ట్రాన్స్‌క్యాథరర్‌ ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ రిపేర్‌’ (టీర్‌)గా పిలిచే సర్జరీని నిర్వహించి దాని ప్రాణాలు కాపాడినట్లు వెల్లడించారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ మాదిరి కాకుండా ఇది ఒక హైబ్రిడ్‌ సర్జరీ అని గుండె కొట్టుకుంటుండగానే దాని వాల్వుకు క్లాంప్‌వేసి ఆపరేషన్‌ పూర్తిచేసినట్లు చెప్పారు. ప్రపంచ దేశాల్లో చాలా అరుదుగా చేసే ఈ సర్జరీని తాము తొలిసారి భారతదేశంలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు

Updated Date - Jun 03 , 2024 | 07:51 AM

Advertising
Advertising