Hyderabad: హిమాచల్ ప్రదేశ్ లో ప్రమాదం... హైదరాబాదీ పారాగ్లైడర్ దుర్మరణం
ABN, Publish Date - Feb 12 , 2024 | 11:32 AM
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఈ ఘటన జరిగింది. టూరిస్ట్ సేఫ్టీ బెల్ట్‌ను సరిగ్గా పెట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఈ ఘటన జరిగింది. టూరిస్ట్ సేఫ్టీ బెల్ట్‌ను సరిగ్గా పెట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మానవ తప్పిదమే ప్రమాదానికి ప్రధాన కారణంగా గుర్తించారు. పైలట్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్న వార్తల నడుమ.. టూరిజం అధికారి సునయన శర్మ స్పందించారు. పైలట్‌కు రిజిస్టర్ చేయించామని, గ్లైడింగ్‌కు ఉపయోగించిన పరికరాలకు సైతం ఆమోదం లభించిందని చెప్పారు. భద్రత విషయంలో సదరు మహిళ నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన వివరించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం పర్యాటకానికి అనుకూలమేనని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. మృతదేహానికి కులు ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కులు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పైలట్ ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం కారణంగా దోభి గ్రామంలో పారాగ్లైడింగ్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 12 , 2024 | 11:32 AM