ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National: ఢిల్లీలో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానులు ఎవరో మీకు తెలుసా.. వీరిలో తెలుగు వ్యక్తి కూడా..

ABN, Publish Date - Dec 28 , 2024 | 02:59 PM

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లిలోని నిగమ్‌ బోథ్‌లో జరిగాయి. ఆయన స్మారకం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగాయి. కేంద్రం మన్మోహన్ సింగ్ అంత్యక్రియల విషయంలో సంప్రదాయాలను పాటించడం లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానుల అంశం తెరపైకి వచ్చింది. గతంలో ముగ్గురు ప్రధానుల అంత్యక్రియలు దేశం బయటే జరిగాయి. ఢిల్లీలో అంత్యక్రియలు జరగని ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం.

Fromer Indian Prime Minister Manmohan Singh

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు ఢిల్లిలోని నిగమ్‌ బోథ్‌లో జరిగాయి. ఆయన స్మారకం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్రం మన్మోహన్‌సింగ్ అంత్యక్రియల విషయంలో సంప్రదాయాలను పాటించడం లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్ ఎలాంటి సంప్రదాయాలు పాటించిందో తెలుసుకోవాలని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానుల అంశం తెరపైకి వచ్చింది. దేశ రాజకీయాల్లో ఓ ప్రధాని అంత్యక్రియల విషయం వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ముగ్గురు ప్రధానుల అంత్యక్రియలు దేశం బయటే జరిగాయి. ఢిల్లీలో అంత్యక్రియలు జరగని ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం.


తెలుగు వ్యక్తి..

భారతదేశానికి 1991 నుండి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్‌ 23న తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లిలోనే నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కానీ, కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు పీవీ అంతిమ సంస్కారాలు హస్తినలో కాకుండా హైదరాబాద్‌లో నిర్వహించేలా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ అంశంపై ఢిల్లీలో ఎన్నో చర్చలు జరిగాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ పార్టీలో సీనియర్ల నుంచి వచ్చిన ఒత్తిడితో ఏమి చేయలేకపోయారని అప్పట్లో మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. చివరకు పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో పీవీ నరసింహరావు స్మారకం నిర్మించాలనే చర్చ జరిగినప్పటికీ నిర్మాణం కాలేదు. తెలంగాణాకు చెందిన పీవీ నరసింహరావు దేశ ప్రధానిగా సేవలు అందించినప్పటికీ ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరగలేదు.


వీపీ సింగ్..

1989 నుంచి 1990 వరకు భారత ప్రధానిగా పనిచేసిన వీపీ సింగ్ 2008లో ఢిల్లీలో మరణించారు. ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారనే చర్చ జరిగింది. చివరికి ఆయనను అలహాబాద్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా.. ప్రభుత్వ ప్రతినిధిగా అప్పటి కేంద్రమంత్రి సుభోద్కాంత్ సహాయ్ సింగ్ వీపీ సింగ్ అంత్యక్రియలు హాజరయ్యారు. ఆ తర్వాత స్మారక చిహ్నం ఢిల్లీలో నిర్మించాలనే ప్రయత్నం చేసినా నిర్మాణం జరగలేదు.


మొరార్జీ దేశాయ్..

1977 నుండి 1979 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ 1995లో ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మొరార్జీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు సబర్మతి ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. మొరార్జీ అంత్యక్రియలకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం మొరార్జీ చితాభస్మాన్ని ఢిల్లీకి తరలించారు.


ఢిల్లీలో అంత్యక్రియలు జరిగిన ప్రధానులు వీరే..

మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, చంద్రశేఖర్, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ఢిల్లీలోనే జరిగాయి. వీరిలో నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ, చౌదరి చరణ్, చంద్రశేఖర్, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకాలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రధానులతో పాటు సంజయ్ గాంధీ అంత్యక్రియలు రాజ్‌ఘాట్‌లో నిర్వహించారు. ఆయన ఎంపీగా పనిచేయడంతో పాటు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Updated Date - Dec 28 , 2024 | 02:59 PM