Elections : హరియాణాలో ఒంటరిగా బరిలోకి ఆప్‌

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:53 AM

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.

Elections : హరియాణాలో ఒంటరిగా బరిలోకి ఆప్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 90 నియోజకవర్గాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు సెప్టెంబరు 12 ఆఖరు కావడంతో ఆప్‌ నిర్ణయం కీలకంగా మారింది. వాస్తవానికి పొత్తులో భాగంగా ఆప్‌ 10 సీట్లు అడగ్గా కాంగ్రెస్‌ కేవలం 5 మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో సొంతంగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌ రాష్ట్ర నాయకత్వం త్వరలో మిగతా అన్ని చోట్లా అభ్యర్థులను ప్రకటించనుంది. ఆప్‌-కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదరకపోవడంతో ఓట్లు చీలి అధికార బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది.

Updated Date - Sep 10 , 2024 | 02:53 AM

Advertising
Advertising