ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deli Waqf Board case: 'ఆప్' ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేసిన ఈడీ

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:47 PM

ఢిల్లీ వక్స్‌ బోర్డ్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ వక్స్‌ బోర్డ్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ (Amanatullah Khan)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఉదయం ఆయన నివాసానికి ఈడీ టీమ్ చేరుకుంది. ఆయనను ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చింది. ఈడీ సిబ్బంది తన ఇంటికి చేరుకోగానే తనను అరెస్టు చేసేందుకే అధికారులు వచ్చినట్టు అమానతుల్లా ఖాన్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తనను అరెస్టు చేసి, ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవడమే సెంట్రల్ ఏజెన్సీ ఉద్దేశమని అన్నారు. తనపై ఈడీ తప్పుడు కేసులు బనాయించినట్టు ఆరోపించారు.


''ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు అయింది. సెర్చ్ వారెంట్ పేరుతో నన్ను అరెస్టు చేయడానికి ఈడీ నా నివాసానికి వచ్చింది. మా అత్తగారికి నాలుగు రోజుల క్రితం కేన్సర్ ఆపరేషన్ చేశారు. ఆమె కూడా మా ఇంట్లోనే ఉన్నారు. ప్రతి నోటీసుకు సమాధానమిస్తానని కూడా నేను ఈడీకి లిఖితపూర్వకంగా చెప్పారు. నన్ను అరెస్టు చేసి, ఢిల్లీ ప్రభుత్వ పనులను ఆపివేయడమే వారి ఏకైక లక్ష్యం. గత రెండేళ్లుగా ఈ వ్యక్తులు (ఈడీ) నన్ను వేధిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయించారు. ప్రతిరోజూ నాకే కాదు, పార్టీకి ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారు. వారికి తలొంచడం కానీ, భయపడేది కానీ లేదు. మమ్మల్ని వాళ్లు జైలుకు పంపవచ్చు. గతంలో తమకు కోర్టులో సత్వర న్యాయం ఎలా జరిగిందో ఈసారి కూడా మాకు న్యాయం జరుగుతుంది'' అని వీడియో స్టేట్‌మెంట్‌లో అమానతుల్లా ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం


ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు

ఢిల్లీ వక్స్‌బోర్డు నియామకాల్లో అవకతవల ఆరోపణలపై 2016లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అమానతుల్లా ఖాన్ ఉన్నారు. తప్పుడు నియామకాల ద్వారా ఆయన వ్యక్తిగత లబ్ధి పొంది, ఢిల్లీ ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించారని సీబీఐ ఆరోపించింది. అనంతరం దీనిపై మనీలాండరింగ్ దర్యాప్తును ఈడీ ప్రారంభించింది. గత ఏడాది అమానతుల్లా ఖాన్ నివాసాలపై దాడులు నిర్వహించి కొన్ని ఫిజికల్, డిజిటల్ సాక్ష్యాలను సీజ్ చేసింది.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 02 , 2024 | 03:47 PM

Advertising
Advertising