ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

ABN, Publish Date - Oct 09 , 2024 | 06:15 PM

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 09: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పష్టం చేశారు. అతి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకోమని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీపై పోరాడతామని ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు.

Also Read: Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు


హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఎన్నిక ఫలితాలపై బుధవారం న్యూఢిల్లీలో ప్రియాంక కక్కర్ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు.

Also Read: Nobel Prize in Chemistry 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి


గత దశాబ్ద కాలంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుకున్న సీట్ల సంఖ్య సున్నా అని ఈ సందర్బంగా ప్రియాంక వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల వేళ.. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఆప్ మూడు లోక్ సభ స్థానాలను కేటాయించిందన్నారు. కానీ ఆయా స్థానాల్లో సైతం ఆ పార్టీ విజయం సాధించలేక పోయిందని చెప్పారు.

Also Read: Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్


హర్యానాలో పొత్తు పెట్టుకోవడంపై ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు చేసిన అన్ని ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని మండిపడ్డారు. దీంతో సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చర్చలు విఫలమయ్యాయన్నారు. దాంతో హర్యానాలో ఆప్ ఒంటరిగా బరిలోకి దిగి.. అన్ని స్థానాల్లో ఓటమి పాలైందని తెలిపారు.

Also Read: ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?


ఇక ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ సైతం అధికారాన్ని అందుకోలేక పోయిందన్నారు. దీంతో హర్యానాలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారాన్ని అందుకుందని చెప్పారు. ఇక ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుంది. దీంతో హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి.. 5 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఆప్ మాత్రం ఒకే ఒక్క స్థానంలో పోటీ చేసి దానిలో సైతం ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించింది. దీంతో ఆ పార్టీ అధికారాన్ని అందుకోలేక పోయింది.

Also Read: Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్


ఇక జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం పట్ల ప్రియాంక కక్కర్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆ రాష్ట్రంలో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్యటించనున్నారని తెలిపారు. దోడాలో ఆప్ అభ్యర్థి మెహర్జా మాలిక్.. బీజేపీ అభ్యర్థి గజయ్ సింగ్ రానాపై దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటు గెలువడంతో ఖాతా తెరవడం పట్ల ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

For National News And Telugu News..

Updated Date - Oct 09 , 2024 | 06:30 PM