LokSabha Elections: ఢిల్లీలో ఆప్ గెలుపు కోసం..
ABN, Publish Date - Apr 27 , 2024 | 04:29 PM
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు వివిద దశల్లో పోలింగ్ జరుగుతుంది. అలాంటి వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆప్ నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు వివిద దశల్లో పోలింగ్ జరుగుతుంది. అలాంటి వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆప్ నిర్ణయించింది.
LokSabha Elections: మమతా బెనర్జీకి మళ్లీ గాయాలు!
ఆ క్రమంలో ఆ యా లోక్‌సభ స్థానాల్లో ఆప్ విజయకేతనం ఎగురవేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనుంది. అందుకోసం ఆప్ ప్రధాన కార్యాలయంలోని వార్ రూమ్‌ను శనివారం ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్, సీనియర్ నేత గోపాల్ రాయ్ ప్రారంభించారు. అనంతరం గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రచార నిర్వహణ, న్యాయ పరమైన పనులు, డేటా మేనేజ్‌మెంట్, అనాలసిస్, మీడియా, సోషల్ మీడియాలో పార్టీ ప్రచార నిర్వహణతోపాటు అభ్యర్థులు గెలుపు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో.. డిల్లీలో కాంగ్రెస్ పార్టీతో ఆప్ కలిసి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో నాలుగు ఆప్ తన అభ్యర్థులను బరిలో దింపింది. మరో 3 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఆప్ అభ్యర్థులు బరిలో దిగే న్యూఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీగా గోపాల్ రాయ్ వ్యవహరిస్తున్నారు.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
అలాగే ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీతోపాటు చాందీని చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ లోక్ సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. అయితే ఆరో దశ.. అంటే మే 25వ తేదీన ఢిల్లీలోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Read National News And Telugu News
Updated Date - Apr 27 , 2024 | 04:30 PM