ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Atishi: మాట్లాడుతూనే ఏడుస్తూ..

ABN, Publish Date - Aug 09 , 2024 | 01:21 PM

లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంపై ఆప్ నేతలు న్యాయం గెలిచింది అంటూ హర్షం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ వచ్చిందని తెలిసిన వెంటనే ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

Delhi Minister Atishi

ఢిల్లీ: లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంపై ఆప్ నేతలు న్యాయం గెలిచింది అంటూ హర్షం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ వచ్చిందని తెలిసిన వెంటనే ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి (Delhi Minister Atishi) తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.


ఉద్వేగానికి గురైన అతిషి

ఓ స్కూల్‌లో విద్యాశాఖ మంత్రి అతిషి ప్రసంగిస్తున్నారు. ఇంతలో విషయం తెలిసి బాధ పడ్డారు. మాటలు ఆపేసి.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పక్కనున్న వారు మంచినీరు ఇవ్వగా కొన్ని తాగారు. తర్వాత కూడా చాలా బాధ పడ్డారు. ఆ తర్వాత మాట్లాడారు.


సత్యం గెలిచింది..

‘మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు సత్యం గెలిచింది. ఢిల్లీ విద్యార్థులు విజయం సాధించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను మనీశ్ సిసోడియా అందజేశారు. గతంలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా సిసోడియా పనిచేశారు. విద్యా విధానంలో సమూల మార్పులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో సిసోడియాను ఇరికించారు. ఢిల్లీ విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆయన తపించారు. ఈ రోజు తమకు ఆనందం కలిగింది. మళ్లీ విద్యా విధానానికి మంచి రోజులు వచ్చినట్టు అయ్యింది. ఇదేవిధంగా లిక్కర్ కేసు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకొస్తారు. ఇది ముమ్మాటికీ ఢిల్లీ ప్రజల విజయం అని’ లోపల నుంచి వస్తోన్న దు:ఖాన్ని అణచుకొని అతిషి మాట్లాడారు.


జైలులో 17 నెలలు

లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియా గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ అయ్యారు. లిక్కర్ పాలసీ రూపొందించి, లబ్ది పొందారని సీబీఐ అభియోగాలు మోపింది. ఆ తర్వాత మార్చి 9వ తేదీన మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగాలు మోపి అరెస్ట్ చేసింది. గత 17 నెలల నుంచి సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ఆ కేసులో సిసోడియాకు ఇన్నాళ్లకు ఊరట కలిగింది. బెయిల్ ఇస్తూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథం నేతృత్వంతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

Updated Date - Aug 09 , 2024 | 01:21 PM

Advertising
Advertising
<