Actor Vijay: జెండాపై ఏనుగు బొమ్మకు అభ్యంతరం లేదు..
ABN, Publish Date - Oct 01 , 2024 | 02:03 PM
ప్రముఖ సినీ నటుడు విజయ్(Movie actor Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రికళగం (టీవీకే) పతాకంలో ఏనుగు బొమ్మలకు తామెలాంటి అభ్యంతరాలు తెలుపలేమంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బీఎస్పీ(BSP) అధిష్టానానికి లేఖ రాసింది.
- విజయ్ పార్టీకి ఈసీ ఊరట
చెన్నై: ప్రముఖ సినీ నటుడు విజయ్(Movie actor Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రికళగం (టీవీకే) పతాకంలో ఏనుగు బొమ్మలకు తామెలాంటి అభ్యంతరాలు తెలుపలేమంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బీఎస్పీ(BSP) అధిష్టానానికి లేఖ రాసింది. ఆగస్టు 22న విజయ్ పార్టీ పతాకాన్ని పరిచయం చేశారు. ఆ జెండా మధ్యలో రెండు ఏనుగుల బొమ్మలు ఉండటంతో ఏనుగు తమ పార్టీ చిహ్నమంటూ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పేర్కొంది. అంతటితో ఆగకుండా విజయ్ పార్టీ పతాకంలో ఏనుగుల బొమ్మలను తొలగించేలా ఆదేశించాలని బీఎస్పీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బీఎస్పీకి ప్రత్యుత్తరం ఇచ్చారు. అందులో రాజకీయ పార్టీల జెండాల్లో ఉండే చిహ్నాలు, రూపాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇవ్వదని, జెండాలోని చిహ్నాలకు తమ సంఘం నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.
ఇదికూడా చదవండి: Govinda: గోవిందాకు బుల్లెట్ గాయం.. పోలీసులు ఏమన్నారంటే
రాజకీయ పార్టీల జెండాల వ్యవహారాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే ప్రసక్తి కూడా లేదని స్పష్టం చేసింది. టీవీకే పతాకంపై తామెలాంటి అభ్యంతరాలు తెలుపలేమంటూ బీఎస్పీకి పంపిన లేఖలో ఈసీ అధికారులు వెల్లడించారు.. అదే సమయంలో టీవీకే ఎన్నికల సంఘంలో ఏనుగు చిహ్నాన్ని ఉపయోగించేందుకు వీలులేదని కూడా హెచ్చరించారు. బీఎస్పీకి కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ప్రత్యుత్తరానికి సంబంధించిన నకలు టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌కు అందటంతో ఆ పార్టీ శ్రేణుల సంతోషానికి పట్టపగ్గాల్లేకపోయింది.
బుస్సీ ఆనంద్ సమీక్ష..
విక్రవాండిలో అక్టోబర్ 27న జరుగనున్న టీవీకే తొలి మహానాడు(Mahanadu) ఏర్పాట్లపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ జిల్లాలవారీగా సమీక్ష జరుపుతున్నారు. ఆ మేరకు తిరువారూరు, కుంభకోణం, తంజావూరు(Tiruvarur, Kumbakonam, Thanjavur) జిల్లాల్లో ఆయా జిల్లా శాఖల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మహానాడుకు ఆయా జిల్లాల నుండి వేల సంఖ్యలో కార్యకర్తలను తరలించే ఏర్పాట్లపై ఆయన జిల్లా శాఖ నాయకులతో చర్చలు జరిపారు. మహానాడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటం ఖాయమని, ఆ ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అందరూ దృష్టి సారించి పార్టీ విజయానికి పాటుపడాలని బుస్సీ ఆనంద్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించి, విజయ్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
................................................................
ఈ వార్తను కూడా చదవండి:
...............................................................
Chennai: బ్రహ్మోత్సవాలకు తిరుపతికి ప్రత్యేక బస్సులు..
చెన్నై: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుపతి(Tirupati)కి ఈ నెల 13వ తేది వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం చెన్నై, తిరుచ్చి, తంజావూరు(Chennai, Tiruchi, Thanjavur), సేలం, కోయంబత్తూర్, మదురై, కారైకుడి, కుంభకోణం, తూత్తుకుడి, పుదుచ్చేరి ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సులు నడుపనున్నామని, రిజర్వేషన్ సౌకర్యముండడంతో ఈ సేవ లు భక్తులు వినియోగించుకోవాలని తెలిపారు. టిక్కెట్ బుకింగ్ కోసం www.tnsrtc.in అనే వెబ్‌సైట్, టీఎన్‌ఎ్‌సటీసీ యాప్ ఉపయోగించవచ్చని సూచించారు.
ఇదికూడా చదవండి: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఇదికూడా చదవండి: ఎమ్మెస్సీ నర్సింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలి
ఇదికూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే
ఇదికూడా చదవండి: ఉపఎన్నికపై కడియం శ్రీహరి సంచలన కామెంట్స్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 01 , 2024 | 02:03 PM