Aditya Thackeray: శివసేన (యూబీటీ) లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఆదిత్య థాకరే
ABN, Publish Date - Nov 25 , 2024 | 07:22 PM
ఆదిత్య థాకరే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి 8,801 ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు. ఆయనకు 63,324 ఓట్లు పోల్ కాగా, షిండే శివసేన నేత మిలంద్ దేవరకు 54,523 ఓట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత సందీప్ సుధాకర్ దేశ్‌పాండేకు 19,367 ఓట్లు పోలయ్యాయి.
ముంబై: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తదుపరి సమావేశం త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (UBT) శాసనసభాపక్ష నేతగా వర్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (Aditya Thackeray) సోమవారంనాడు ఎన్నికయ్యారు. పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆదిత్య థాకరేను ఎన్నుకొన్నట్టు శివసేన (యూబీటీ) ఒక ప్రకటనలో తెలిపింది.
Vaishno Devi Ropeway Project: పోలీసులతో స్థానికుల ఘర్షణ, రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలు
ఆదిత్య థాకరే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి 8,801 ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు. ఆయనకు 63,324 ఓట్లు పోల్ కాగా, షిండే శివసేన నేత మిలంద్ దేవరకు 54,523 ఓట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత సందీప్ సుధాకర్ దేశ్‌పాండేకు 19,367 ఓట్లు పోలయ్యాయి.
'మహా వికాస్ అఘాడి'లో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 20 సీట్లకే పరిమితం కాగా, ఆ పార్టీ నుంచి విడిపోయిన ఏక్‌నాథ్ షిండే శివసేన 'మహాయుతి' కూటిమలో భాగంగా 57 సీట్లు గెలుచుకుంది. అవిభక్త శివసేన రెండుగా చీలిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం విశేషం.
రెట్టించిన బలంతో తిరిగొస్తాం..
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫలితాలపై ఆదిత్య థాకరే మాట్లాడుతూ, భవిష్యత్తులో పూర్వవైభవాన్ని మరింత బలంగా పార్టీ చాటుకుంటుందని అన్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల అంచనాలకు అతీతంగానే ఉన్నప్పటికీ, తమ పార్టీకి లభించిన ఆశీస్సులు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో పార్టీని పటిష్టవంతంగా, ఎవరూ ఊహించనంత ఎత్తుకు తీసుకువెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
Supreme Court: రాజ్యాంగ పీఠిక అంశంపై సుప్రీం కీలక తీర్పు
Sambhal Violence: మసీదు సర్వే నేపథ్యంలో ఘర్షణ.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్
Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 25 , 2024 | 07:22 PM