ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu Kashmir assembly polls: జమ్మూ కశ్మీర్‌కు ఖర్గే, రాహుల్

ABN, Publish Date - Aug 20 , 2024 | 05:12 PM

ఆగస్ట్ 21, 22 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతోపాటు పార్టీ శ్రేణులతో వారు భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చిస్తారు.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 20: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలే కాదు.. జాతీయ పార్టీలు సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అలాంటి వేళ.. ఆగస్ట్ 21, 22 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.

Also Read: Uttar Pradesh: మొరాదాబాద్‌ దారుణం.. నర్స్‌పై లైంగిక దాడి.. ఆసుపత్రి సీజ్


జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతోపాటు పార్టీ శ్రేణులతో వారు భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఎక్స్ వేదికగా వివరించారు. బుధవారం మధ్యాహ్నం ఖర్గే, రాహుల్ జమ్మూ చేరుకుంటారు. అనంతరం వారు.. పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు.

Also Read: Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?


ఆ తర్వాత శ్రీనగర్ చేరుకుని.. పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో ఇంత పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కట్టే అవకాశముందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాకుండా బీజేపీని నియంత్రించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు.

మరోవైపు నాలుగు రాష్ట్రాలు.. హరియాణ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, స్కీనింగ్ కమిటీ సభ్యులతో సోమవారం న్యూఢిల్లీలో ఖర్గే, రాహుల్ సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే.

Also Read: Spurious Liquor: కల్తీ మద్యం తాగి.. 14 మందికి తీవ్ర అస్వస్థత


జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు విడుతల్లో జరగనున్నాయి. అందులోభాగంగా తొలి విడత నోటిఫికేషన్ మంగళవారం ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4వ తేదీ వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.

ఈ నేపథ్యంలో అధికారాన్ని హస్త గతం చేసుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలే కాకుండా.. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు సైతం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాయి. ఇంకోవైపు బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

For Latest News and National News click here

Updated Date - Aug 20 , 2024 | 05:24 PM

Advertising
Advertising
<