ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: రోగాన్ని కనిపెట్టారు సరే.. చికిత్స చేసేదెవరు

ABN, Publish Date - Dec 03 , 2024 | 03:57 PM

హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తప్పకుండా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ కూటమికి భంగపాటు తప్పలేదు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షానికి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు దక్కలేదు. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో..

Kharge

సార్వత్రిక ఎన్నికల్లో వంద లోక్‌సభ స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష హోదా సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గస్థాయిలో సత్తా చాటలేకపోయింది. జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం సాధించినప్పటికీ ఆ రెండు చోట్ల రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండగా.. కాంగ్రెస్ మైనర్ పార్టనర్‌గా మాత్రమే ఉంది. ఇక హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తప్పకుండా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ కూటమికి భంగపాటు తప్పలేదు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షానికి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు దక్కలేదు. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇటీవల సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఎట్టకేలకు పార్టీకి పట్టిన అసలు రోగాన్ని కనుకొన్నారు. వర్గపోరు కాంగ్రెస్‌లో అతిపెద్ద బలహీనతగా ఖర్గే పేర్కొన్నారు. వర్గపోరు కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, సొంతపార్టీ నేతలే కుమ్ములాటలకు దిగుతుంటే బీజేపీ వంటి పార్టీతో ఎలా పోరాడటామంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సమైక్యంగా ఉంటేనే బలంగా ఉంటాం అనే నినాదాన్ని అమలు చేయాలని ఖర్గే ప్రతిపాదించినప్పటికీ.. పార్టీలో నేతల మధ్య విబేధాలను పక్కనపెట్టి.. అందరినీ ఏకతాటిపైకి ఖర్గే తీసుకురాగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది.


ఖర్గే కొత్త ఫార్ములా

హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకునేందుకు ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లికార్జున్ ఖర్గే పార్టీ బలహీనతలను బయటపెట్టారు. ప్రస్తుత సమస్యల నుంచి బయటపడాలంటే నాయకులంతా ఐక్యంగా ఉండాలని, ఐక్యంగాఉంటే సురక్షితంగా ఉంటామనే నినాదాన్ని ఖర్గే ఇచ్చారు. ఇప్పటికే మహారాష్ట్రలో విడిపోతే చెడిపోతాం అనే నినాదంతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మెజార్టీ వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కొంచెంలో కొంచెం బీజేపీ సక్సెస్ కావడంతోనే ఏకపక్ష ఫలితాలు వచ్చాయనే చర్చ జోరుగా సాగింది. ఈ తరుణంలో సమైక్యంగా ఉంటే బలంగా ఉంటామంటూ ఖర్గే ఇచ్చిన నినాదాన్ని హస్తం పార్టీ నేతలు ఎంతవరకు ఫాలో అవుతారనేది వేచి చూడాలి.


ఓటమిపై సమీక్ష

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పార్టీ కనిపించిందని, బీజేపీ ఒంటరిగా అధికారానికి అవసరమైన మెజార్టీ సాధించకుండా అడ్డుకోగలిగామని.. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆశలన్నీ అడియాసలయ్యాయని మల్లికార్జున్ ఖర్గే సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలను గుర్తుచేసుకుంటూ సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో అన్ని బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖర్గే దిశానిర్దేశం చేశారు. పరస్పరం ఐక్యత లేకపోవటం, సొంతపార్టీ నేతల మధ్య పరస్పరం వ్యతిరేక ప్రకటనలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అసలు కారణమని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోవడమే తమ ఓటములకు కారణమని చెప్పిన ఖర్గే.. ఆ రోగానికి ఎంతవరకు చికిత్స చేయగలరో చూడాలి మరి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 03 , 2024 | 03:57 PM