ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Air India: టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు.. ఆ వెంటనే..

ABN, Publish Date - May 19 , 2024 | 12:20 PM

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైలట్ వెంటనే విమానాన్ని ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకి దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Air India Flight

బెంగళూర్: ఎయిర్ ఇండియా (Air India) విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైలట్ వెంటనే విమానాన్ని ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకి దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ విమానంలో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బెంగళూర్ నుంచి కొచ్చి వెళుతుండగా విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.


బెంగళూరులో గల కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి 11.12 గంటలకు కొచ్చికి బయల్దేరింది. కాసేపటికే కుడి వైపు ఉన్న ఇంజిన్‌లో మంటలను సిబ్బంది గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. ఏటీసీ అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి రన్ వే వద్ద సిబ్బంది ఉన్నారు. విమానం దిగిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకి దింపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడం కోసం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తామని వివరించింది.



Read Latest
National News and Telugu News

Updated Date - May 19 , 2024 | 12:22 PM

Advertising
Advertising