Ajit Pawar: మా వాటా సీట్లలో 10 శాతం మైనారిటీలకే..
ABN, Publish Date - Oct 02 , 2024 | 04:35 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అధికార 'మహాయుతి కూటమి' నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. తాజాగా మహా కూటమి భాగస్వామి అయిన ఎన్‌సీపీ-ఎపీ చీఫ్ అజిత్ పవార్ తమ వాటా సీట్లలో 10 శాతం టిక్కెట్లు మైనారిటీలకు కేటాయిస్తామని ప్రకటిస్తారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అధికార 'మహాయుతి కూటమి' నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. తాజాగా మహా కూటమి భాగస్వామి అయిన ఎన్‌సీపీ-ఎపీ చీఫ్ అజిత్ పవార్ (Ajit Pawar) తమ వాటా సీట్లలో 10 శాతం టిక్కెట్లు మైనారిటీలకు కేటాయిస్తామని ప్రకటిస్తారు. మహారాష్ట్రలోని బీడ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికలకు సంబంధించి మైనారిటీ కమ్యూనిటీకి ఒక విషయం చెప్పదలచుకున్నానని, సీట్ల షేరింగ్‌లో ఎన్‌సీపీకి ఎన్ని సీట్లు వస్తే వాటిలో పది శాతం సీట్లు మైనారిటీలకు ఇస్తామని చెప్పారు. పరోక్షంగా బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణేను లక్ష్యంగా చేసుకుని అజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
''మైనారిటీలకు పది శాతం సీట్లు ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అన్ని కులాలు, మతాలను విశ్వసించే శివ్-షాహు ఫులేను నేను అనుసరిస్తుంటాను. కొందరు బెల్గావ్ బయన్వీర్‌లు (నితీష్ రాణా) మతాలు, తెగలు, కమ్యూనిటీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు" అని అజిత్ అన్నారు. ఆసక్తికరంగా, 'ఓట్ జిహాద్' కారణంగా మహారాష్ట్రలోని మహాయుతి కూటమి 48 సీట్లలో 14 సీట్లు కోల్పోయిందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అజిత్ పవార్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Nitin Gadkari: గుట్కా తిని రోడ్డుమీద ఉమ్మేసే వాళ్లను ఇలా కట్టడి చేయొచ్చు... చిట్కా చెప్పిన గడ్కరి
ఫడ్నవిస్ ఏమన్నారు?
దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు (ముస్లిం వర్గం) తమ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట పద్ధతిలో ఓటింగ్ ద్వారా హిందుత్వ శక్తులను ఓడించగలమనే అభిప్రాయంతో ఉన్నట్టు చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో 14 సీట్లను మహా కుటమి కోల్పోయిందని అన్నారు. కాగా, మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియాల్సి ఉండగా, ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ఎన్నికల సంఘం ఇటీవల రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించింది.
Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం
Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు
Updated Date - Oct 02 , 2024 | 04:35 PM