Share News

LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక

ABN , Publish Date - May 01 , 2024 | 02:42 PM

మేథీ, రాయబరేలి లోక్‌సభ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులపై కొన్ని గంటల్లో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా సెల్ చీఫ్ జై రాం రమేశ్ బుధవారం వెల్లడించారు. ఆ యా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కసరత్తు చేస్తున్నారన్నారు. 24 గంటల్లో లేదా 30 గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక
Jairam Ramesh

న్యూఢిల్లీ, మే 1: అమేథీ, రాయబరేలి లోక్‌సభ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులపై కొన్ని గంటల్లో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా సెల్ చీఫ్ జై రాం రమేశ్ బుధవారం వెల్లడించారు. ఆ యా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కసరత్తు చేస్తున్నారన్నారు. 24 గంటల్లో లేదా 30 గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు


మరోవైపు అమేథీ, రాయబరేలి లోక్‌సభ స్థానాల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో ఓ ప్రచారం అయితే ఊపందుకొంది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ సంతకం చేసిన ప్రకటన.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇంకోవైపు రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మరో ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sujana Choudhary: ప్రజల కలలను సాకారం చేసేలా కూటమి మేనిఫేస్టో..:


ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. అదీకాక అమేథీ, రాయబరేలీ లోక్‌సభ స్థానాలకు నామినేషన వేసేందుకు తుదిగడువు.. మే 3వ తేదీ. దీంతో ఈ రెండు లోక్ సభ స్థానాలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇక ఈ రెండు స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఆనంద్ శర్మ, రాజబబ్బర్‌లను బరిలో దింపే అవకాశం ఉందని ఆ పార్టీలో ఓ చర్చ సైతం అంతర్గతంగా సాగుతుంది.

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 02:42 PM