ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amit Shah: సీఏఏపై రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్.. ఏమిటంటే?

ABN, Publish Date - Mar 14 , 2024 | 04:33 PM

ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act - CAA) ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటు బ్యాంకు కోసమే కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం దీన్ని ఎన్నికల ముందు అమలు చేసిందని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act - CAA) ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటు బ్యాంకు కోసమే కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం దీన్ని ఎన్నికల ముందు అమలు చేసిందని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. వాళ్లకు విమర్శించడం తప్ప మరే పని లేదని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో.. రాహుల్ గాంధీకి ఓ సవాల్ విసిరారు. సీఏఏని ఎందుకు వ్యతిరేకంగా బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘ఈ సీఏఏ విషయం గురించి రాహుల్ గాంధీని మీరు ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుతున్నా. ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో రాహుల్ గాంధీ బహిరంగంగా వివరించాలని సవాల్ నేను చేస్తున్నా. రాజకీయాల్లో మీరు చేసే వ్యాఖ్యలను సమర్థించుకునే బాధ్యత మీదే’’ అని అన్నారు. తమ ప్రభుత్వం ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చిందో తాము వివరణ ఇచ్చామని, అలాగే ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో రాహుల్ వివరణ ఇవ్వాలని చెప్పారు. 2019 మేనిఫెస్టోలో (2019 BJP Manifesto) తాము ఇచ్చిన వాగ్ధానాల్లో సీఏఏ ఒకటని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు దానిని నెరవేర్చామని చెప్పుకొచ్చారు. రాహుల్‌తో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నాయకులు సీఏఏపై అసత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలోనూ ఆర్టికల్ 370 రద్దుని ప్రతిపక్షాలు ప్రశ్నించాయని.. ఇప్పుడు సీఏఏతో ఓటు బ్యాంకు సృష్టించుకుంటోందని ఆరోపిస్తున్నాయని అమిత్ షా నిప్పులు చెరిగారు. తాము ఎన్నికల కోసం సీఏఏను అమలు చేయలేదని.. 2019లోనే దీనిని పార్లమెంట్‌లో (Parliament) ఆమోదించామని గుర్తు చేశారు. అయితే.. కొవిడ్‌తో (Covid-19) పాటు ఇతర కారణాల వల్ల ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఆలస్యం అయ్యిందని వివరించారు. అలాంటప్పుడు ప్రతిపక్షాలు ‘టైమింగ్’ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నాయని ప్రశ్నించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు న్యాయంతో పాటు వారి హక్కులు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని.. ఇందులో రాజకీయ లబ్ది పొందే ప్రశ్నే లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 04:34 PM

Advertising
Advertising