LokSabha Elections: గాంధీనగర్‌లో నామినేషన్ వేసిన అమిత్ షా
ABN , Publish Date - Apr 19 , 2024 | 03:30 PM
గుజారాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రి బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం గాంధీనగర్‌లో ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. గాంధీనగర్ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
గాంధీనగర్, ఏప్రిల్ 19: గుజారాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రి బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం గాంధీనగర్‌లో ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. గాంధీనగర్ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
YS Vijayamma: అమ్మకు బర్త్ డే విషెష్ చెప్పిన షర్మిలమ్మ
తనకు మరోసారి లోక్‌సభ సీటు కేటాయించడం పట్ల అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తనకు ఎంపీ సీటు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ సందర్బంగా కృతజ్జతలు తెలిపారు. ఇక అమిత్ షా వెంట గుజారాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.
మరోవైపు తొలి దశ లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని అవినీతి, బంధు ప్రీతి, బుజ్జగింపుల నుంచి విముక్తి చేసే ధృడ సంకల్పాన్ని ప్రదర్శించే బలమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు అమిత్ షా విజ్జప్తి చేశారు. మీ ఓటు అభ్యర్థి భవితవ్వాన్ని నిర్ణయించడమే కాకుండా.. దేశ ఉజ్వల భవిష్యత్తును రూపొందించడానికి ఉద్దేశించింది కూడా అని ఎక్స్ వేదికగా అమిత్ షా స్పష్టం చేశారు.
Lok Sabha Polls: క్లీన్ స్వీప్ ఖాయం: ఉదయనిధి స్టాలిన్
ఇక గాంధీనగర్ లోక్‌సభ పరిధిలోని పలు జిల్లాల్లో గురువారం నుంచి అమిత్ షా రోడ్డు షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ ఘన విజయం సాధించిన విషయం విధితమే.
జాతీయ వార్తలు కోసం..