ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amit Shah: సొంత కారు లేదు.. రూ.15 లక్షల అప్పు ఉంది.. అమిత్ షా ఆస్తుల విలువ ఇవే..

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:08 PM

లోక్ సభ ఎన్నికలు - 2024కు ( Lok Sabha Elections - 2024 ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తనకు ఎంత ఆస్తి ఉందో వెల్లడించారు.

లోక్ సభ ఎన్నికలు - 2024కు ( Lok Sabha Elections - 2024 ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తనకు ఎంత ఆస్తి ఉందో వెల్లడించారు. అప్పులు, ఆస్తులు, వాహనాలు, బంగారం, వెండి వంటి పూర్తి వివరాలు వివరించారు. తనకు రూ.36 కోట్ల విలువైన చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నాయని అమిత్ షా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని చెప్పారు. రూ.20 కోట్ల చరాస్తులు ఉన్నాయని, స్థిరాస్తుల విలువ రూ.16 కోట్లు అని పేర్కొన్నారు. తన వద్ద రూ.72 లక్షల విలువైన బంగారం, వెండి, తన భార్య వద్ద ఉన్న నగలు రూ.1.10 కోట్లు విలువైనవి అని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.


PM Modi: సభ మధ్యలో తల్లి ఫోటో చూసి మోదీ భావోద్వేగం

హోంమంత్రి అమిత్ షా భార్య సోనాల్ షా ఆస్తుల విలువ రూ.31 కోట్లు కాగా.. ఇందులో రూ.22.46 కోట్ల విలువైన చరాస్తులు, రూ.9 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. అమిత్ షా పేరిట రూ.15.77 లక్షల అప్పు ఉంది. ఆయన భార్య పేరిట రూ.26.32 లక్షల రుణం ఉంది. 2022-23లో అమిత్ షా వార్షిక ఆదాయం రూ.75.09 లక్షలు కాగా.. ఆయన భార్య ఆదాయం రూ.39.54 లక్షలు.


Ayodhya: రామ్ లల్లా భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..

ఎంపీగా వచ్చిన జీతం, ఇల్లు, భూమి అద్దె, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం, షేర్లు, డివిడెండ్‌ల ద్వారా వచ్చే డబ్బు అమిత్ షా ఆదాయ వనరులు. అఫిడవిట్‌లోని వృత్తి విభాగంలో రైతు, సామాజిక కార్యకర్తగా పేర్కొన్నారు. తనపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. బీజేపీ నేత అమిత్ షా గాంధీనగర్ నుంచి 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందిస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 20 , 2024 | 12:08 PM

Advertising
Advertising