Amit Shah: 'రాహుల్ విమానం' మరోసారి కూలిపోతుంది
ABN, Publish Date - Nov 13 , 2024 | 07:54 PM
అయోధ్యలో రామాలయ నిర్మాణం జరక్కుండా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఔరంగజేబ్ కూల్చేసిన కాశీ విశ్వనాథ ఆలయానికి కారిడార్ నిర్మించడం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో స్వర్ణ సోమనాథ ఆలయాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.
ముంబై: 'రాహుల్ బాబా' అనే పేరు కలిగిన విమానం ఇప్పటికే 20 సార్లు కూలిపోయిందని, నవంబర్ 20వ తేదీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత 21వ సారి కూలిపోనుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) జోస్యం చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) ప్రచారంలో భాగంగా పర్బని జిల్లా జింటూరులో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ బాబా పేరుతో ఉన్న విమానాన్ని 20 సార్లు ల్యాండ్ చేయడానికి సోనియాగాంధీ ప్రయత్నించగా 20 సార్లూ కూలిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఈసారి కూడా సోనియా ప్రయత్నం బెడిసికొడుతుందని చెప్పారు.
PM Modi: అలాచేస్తే... ఇంటింటికి రూ.75,000
మోదీ వల్లే అయోధ్య రామాలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్
అయోధ్యలో రామాలయ నిర్మాణం జరక్కుండా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఔరంగజేబ్ కూల్చేసిన కాశీ విశ్వనాథ ఆలయానికి కారిడార్ నిర్మించడం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో స్వర్ణ సోమనాథ ఆలయాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. భారతదేశాన్ని సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా మోదీ తీర్చిదిద్దారని ప్రశంసించారు.
మహా వికాస్ అఘాడీకి చెల్లుచీటీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను విదర్భ, నార్త్ మహారాష్ట్ర, వెస్ట్ మహారాష్ట్ర, కొంకణ్, ముంబై, మరాఠ్వాడా తదితర ప్రాంతాల్లో పర్యటించానని అమిత్‌షా చెప్పారు. ''ఫలితాలు ఎలా ఉంటాయో మీరు వినదలచుకున్నారా? అయితే వినండి. నవంబర్ 23న మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి తుడిచిపెట్టుకుపోతుంది'' అని అన్నారు. మోదీజీ నాయకత్వంలో నవంబర్ 23న మహాయుతి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్
నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
For More National And Telugu News
Updated Date - Nov 13 , 2024 | 07:54 PM