ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:33 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. దేశవ్యతిరేకంగా మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత (Congress leader), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనపై (Foreign Visit) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ట్వీట్ (Tweet) చేశారు. ‘‘దేశవ్యతిరేకంగా మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది... జమ్మూ కాశ్మీర్‌లో జేకేఎన్‌సి (JKNC) దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.. రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశ భద్రత, మనోభావాలను దెబ్బతీస్తున్నారు... భాష నుండి భాష, ప్రాంతం నుండి ప్రాంతం, మతం నుంచి మతానికి వివక్ష గురించి మాట్లాడటం రాహుల్ గాంధీ విభజన ఆలోచనను తెలియజేస్తుంది’’ అని అన్నారు.


దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని దేశం ముందుకు తీసుకొచ్చారని అమిత్ షా విమర్శించారు. మనస్సులోని ఆలోచనలు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో బయటపడుతుంటాయని, బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని, దేశ సమైక్యతతో ఎవరూ ఆడుకోలేరని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.


రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే బీజేపీ 240 సీట్లకు దరిదాపుల్లో కూడా వచ్చేది కాదన్నారు. అమెరికాలోని జార్జిటౌన్‌ యూనివర్సిటీలో మంగళవారం విద్యార్థులతో జరిగిన సమావేశంలో రాహుల్‌ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు 3నెలల ముందు తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారన్నారు. ఫలితంగా బీజేపీకి లబ్ధి కలిగిందని, ఎన్నికల సంఘం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రెండు మూడు బడా వ్యాపార సంస్థలతో మోదీ ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. ఎన్నికలకు ముందు మోదీ భయాన్ని వ్యాపింపజేశారని.. ఎన్నికల తర్వాత ప్రజలకు భయం పోయిందని అన్నారు. 56 అంగుళాల ఛాతీ, దేవుడితో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పుకొన్న మోదీ.. ఎన్నికల తర్వాత నీరుగారిపోయారని ఎద్దేవా చేశారు. తాను మోదీని ద్వేషించనని, ఆయన ఆలోచనా విధానాన్ని వ్యతిరేకిస్తానని రాహుల్‌ తెలిపారు. భారతదేశంలో రాజకీయాల మధ్య ఘర్షణ జరగడం లేదని, ప్రాథమిక హక్కుల గురించి జరుగుతోందని చెప్పారు. ఒక సిక్కు తన తల పాగా, కాడాను ధరించేందుకు అనుమతిస్తారా? అన్న దానిపై వివాదం ఉందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం సిక్కులకే కాదని, అన్ని మతాలవారికీ వర్తిస్తుందని అన్నారు.


భారత్‌ ఒక మంచి దేశంగా మారినప్పుడు రిజర్వేషన్లను రద్దు చేస్తాం..

రాజ్యాంగాన్ని పరిరక్షించేవారికి, దాన్ని ధ్వంసం చేసేవారికి మధ్య జరిగిన పోరుగా పేదలు తాజా లోక్‌సభ ఎన్నికలను అర్థం చేసుకున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కులగణన కూడా ఒక మౌలిక అంశంగా మారిందన్నారు. భారత్‌ ఒక మంచి దేశంగా మారినప్పుడు రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఓబీసీ, దళితులకు సమాజంలో భాగస్వామ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రూపాయల్లో ఆదివాసీలకు పది, దళితులు, ఓబీసీలకు 5 రూపాయలు మాత్రమే దక్కుతున్నాయన్నారు. అదానీ, అంబానీలకు లభించిన ప్రయోజనాలే అందరికీ దక్కినప్పుడే జనరల్‌ కేటగిరీలో ఉన్నవారికి లబ్ధి చేకూరుతుందని.. అయితే అందుకు అవసరమైన మార్గాలను మూసేశారని అన్నారు.

రాజ్యాంగంలో భారతదేశం ఒక యూనియన్‌ అని ఉందని.. బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోదని రాహుల్‌ చెప్పారు. దేశంలో కొన్ని రాష్ట్రాల కంటే కొన్ని రాష్ట్రాలు తక్కువ అని, కొన్ని భాషల కంటే ఇంకొన్ని భాషలు తక్కువ అని.. కొన్ని మతాల కంటే మరికొన్ని మతాలు గొప్పవని ఆరెస్సెస్‌ చెబుతోందని ఆరోపించారు. తమిళం, మరాఠీ, బెంగాలీ, మణిపురి.. ఇవన్నీ తక్కువ ప్రమాణాలు కలిగిన భాషలని అంటోందని.. ఆ సంస్థకు భారతదేశం అర్థం కాదని, ఇక్కడే తగువు మొదలవుతుందని రాహుల్‌ చెప్పారు. దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వేతో పాటు సమగ్ర కులజనగణన జరగాల్సిందేనని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాటర్ ట్యాంక్‌పై వినాయకుడు.. ఐడియా అదిరింది..

కేంద్ర ఆర్థిక సంఘంతో రేవంత్ రెడ్డి బృందం భేటీ.. (ఫోటో గ్యాలరీ)

గోదావరి మహోగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..

అందుకే తేజస్వీతో సీఎం నితీశ్ భేటీ...

ఉచిత ఇసుక..నేటి నుండే పోర్టల్ ప్రారంభం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 11 , 2024 | 12:33 PM

Advertising
Advertising