Varanasi : గంగా హారతిలో పాల్గొన్న అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్
ABN, Publish Date - May 11 , 2024 | 09:28 PM
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం సాయంత్రం వారణాసి లోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద జరిగిన 'గంగా హారతి'లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఉన్నారు.
వారణాసి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) శనివారం సాయంత్రం వారణాసి (Varanasi)లోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద జరిగిన 'గంగా హారతి' (Ganga Harati)లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అమిత్‌షా పోస్ట్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 'వారణాసి' కంచుకోటగా నిలుస్తోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మోదీ గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ ఇక్కడి నుంచే మూడోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. మోదీపై ఆయన వారణాసిలో పోటీకి దిగడం కూడా ఇది మూడోసారి. ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది.
Updated Date - May 11 , 2024 | 09:28 PM