ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uttar Pradesh : లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీ మాజీ నేతపై ఎఫ్ఐఆర్..

ABN, Publish Date - Mar 20 , 2024 | 12:16 PM

హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) లోని లక్నోలోని కోర్టు సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు

హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) లోని లక్నోలోని కోర్టు సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ అదనపు డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ తెలిపారు. రాగిణి రస్తోగి దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. లక్ష్మీ దేవి నాలుగు చేతులతో ఎలా పుట్టిందని ప్రశ్నిస్తూ ప్రసాద్ మౌర్య ఎక్స్ లో ట్వీట్ చేసిన వార్తా కథనం హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవునికి రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కళ్లు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, ఒక తల, ఒక ఉదరం, వీపు ఉంటాయి. ఏ మతానికి చెందిన వారైనా అందరూ ఇలాగే ఉంటారు. జాతి, మతం, కులం, సంస్కృతి ఆధారంగా లక్ష్మీదేవీ నాలుగు చేతులతో ఎలా జన్మించింది. ఇప్పటి వరకు నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, 10 చేతులు, 20 చేతులు కలిగిన మనుషులు ఎవరూ జన్మించలేదు" అని మౌర్య రాసిన పోస్ట్‌ పై రస్తోగి అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 12:16 PM

Advertising
Advertising