LS Polls: కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు రేపుతున్న పూర్నియా సీటు..
ABN, Publish Date - Mar 31 , 2024 | 10:23 AM
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులతో కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని నేతలతొ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంమతంది నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతుంటే.. మరికొందరు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులతో కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని నేతలతొ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంమతంది నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతుంటే.. మరికొందరు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలో బీహార్(BIHAR)లో పూర్నియా సీటుపై వివాదం నెలకొంది. ఈ సీటును కాంగ్రెస్ నేత పప్పుయాదవ్ ఆశించారు. టికెట్ హామీతో ఆయన జన అధికార పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా ఆర్జేడీ(RJD) ఆ సీటు నుంచి పోటీచేయాలని నిర్ణయించింది. బీమా భారతిని అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు పూర్నియా ప్రజల డిమాండ్‌తో ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేస్తానని పప్పు యాదవ్ తెలిపారు. ఆయన ప్రకటన తర్వాత బీహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
BJP: ఓటింగ్ లేదు కౌంటింగ్ లేదు..ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న బీజేపీ
పొత్తులో భాగంగా
బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఆర్జేడీ 26, కాంగ్రెస్ 9, వామపక్షాలు ఐదు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆర్జేడీకి కేటాయించిన 26 స్థానాల్లో పూర్నియా లోక్‌సభ స్థానం ఉంది. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. వామపక్ష పార్టీలు కూడా ఆర్జేడీకి మద్దతు ప్రకటించిన వేళ మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తానని పప్పు యాదవ్ బాంబు పేల్చాు. పూర్నియా నుండి మాత్రమే పోటీ చేస్తానని గతంలో చాలాసార్లు చెప్పానని.. తాను లోకాన్ని విడిచి వెళ్లగలనేమో కానీ పూర్ణియాను విడిచిపెట్టలేనని తెలిపారు. పప్పు యాదవ్ ప్రకటన కూటమిలో చిచ్చు పెట్టినట్లైంది.
ఏప్రిల్ 2న నామినేషన్
ఏప్రిల్ 2న పూర్నియా స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేస్తానని పప్పు యాదవ్: ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారా లేదా ఇండిపెండెంట్‌గా చేస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. పూర్నియా ప్రజల డిమాండ్ మేరకు ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ తన తల్లి అని, జీవితాంతం కాంగ్రెస్‌కు సేవ చేస్తూనే ఉంటానని పప్పూ యాదవ్ చెప్పారు. పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరుగుతున్నాయని, 2వ తేదీ నాటికి స్పష్టత వస్తుందన్నారు.
తేజస్వీ యాదవ్ కామెంట్స్
పూర్నియా సీటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పొత్తు పార్టీతోనే ఉందని, ఏ వ్యక్తితోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. తేజస్వీ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.
Maha Rally: నేడు రాంలీలా మైదాన్‌లో భారత్ కూటమి మహార్యాలీ..ట్రాఫిక్ ఆంక్షలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 31 , 2024 | 10:23 AM