ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NAtional: ‘నీట్‌’పై సుప్రీంకోర్టులో మరో రిట్‌

ABN, Publish Date - Jun 11 , 2024 | 03:24 AM

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌-యూజీ పరీక్షల్లో నేషనల్‌ టెస్టింగ్‌ అథారిటీ (ఎన్‌టీఏ) గ్రేస్‌ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో రిట్‌ పిటిషన్‌ దాఖలయింది. సమయాన్ని నష్టపోయారన్న (‘లాస్‌ ఆఫ్‌ టైమ్‌’) కారణం చూపించి ఎన్‌టీఏ 1,536 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇచ్చింది.

న్యూఢిల్లీ, జూన్‌ 10: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌-యూజీ పరీక్షల్లో నేషనల్‌ టెస్టింగ్‌ అథారిటీ (ఎన్‌టీఏ) గ్రేస్‌ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో రిట్‌ పిటిషన్‌ దాఖలయింది. సమయాన్ని నష్టపోయారన్న (‘లాస్‌ ఆఫ్‌ టైమ్‌’) కారణం చూపించి ఎన్‌టీఏ 1,536 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇచ్చింది. ఇందుకు అభ్యంతరం చెబుతూ ఏపీకి చెందిన నీట్‌ అభ్యర్థి జరిపాటే కార్తీక్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రేస్‌ మార్కులు ఇవ్వడం కోసం నార్మలైజేషన్‌ ఫార్ములాను అనుచిత పద్ధతుల్లో ఉపయోగించారని పిటిషనర్‌ ఆరోపించారు. ఇది చట్టవ్యతిరేకం, ఏకపక్షం, రాజ్యాంగంలోని ఈ పరీక్షల్లో నార్మలైజేషన్‌ ఫార్ములాను ఉపయోగించకూడదని తెలిపారు. ఎందుకంటే ఈ పరీక్ష అభ్యర్థులకు ఆయా సబ్జెక్టుల్లో ఉన్న జ్ఞానాన్ని ప్రత్యక్షంగా మదింపు వేయడానికి ఉద్దేశించినదని పేర్కొన్నారు. ఈ ఫార్ములా ప్రకారమయితే వాస్తవ మదింపు ఆధారంగా కాకుండా, అంచనాల ఆధారంగా మార్కులు వేస్తారని తెలిపారు. అందువల్ల ఆ ఫార్ములా ఇక్కడ ఉపయోగపడదని తెలిపారు. అంతేకాకుండా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించినందున ‘లాస్‌ ఆఫ్‌ టైమ్‌’ను లెక్కించడానికి ప్రామాణిక విధానమేదీ లేదని వివరించారు. అసలు గ్రేస్‌ మార్కులను లెక్కించడానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై సత్వర విచారణ జరిగేలా లిస్టింగ్‌ చేయాలని అతని తరఫు లాయర్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 03:24 AM

Advertising
Advertising