Kulgam: ఆర్మీ వాహనం బోల్తాపడి సైనికుడి మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు
ABN, Publish Date - Oct 26 , 2024 | 02:47 PM
చినార్ కార్ప్స్ అధికారి ఒకరు ఈ ఘటనను వివరిస్తూ, శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా వెళ్లున్న ఆర్మీ వ్యాను కుల్గాంలోని డీహెచ్ పోర ప్రాంతంలో రోడ్డుపై జారడంతో బోల్తా పడిందన్నారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గావ్ (Kulgam)లో విషాద ఘటన చోటుచేసుకుంది. సైనికులతో ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తూ రోడ్డుపై జారి, ఆ వెంటనే బోల్తాపడటంతో ఒక సైనికుడు మృతి చెందాడు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
Former CM: నో డౌట్.. 2026లో అధికారం మాదే!
చినార్ కార్ప్స్ అధికారి ఒకరు ఈ ఘటనను వివరిస్తూ, శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా వెళ్లున్న ఆర్మీ వ్యాను కుల్గాంలోని డీహెచ్ పోర ప్రాంతంలో రోడ్డుపై జారడంతో బోల్తా పడిందన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో ఒక జవాను మృతిచెందగా, పలువురు గాయపడ్డారని, సకాలంలో మెడికల్ ఎయిడ్ అందించడంతో వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
గుల్మార్గ్‌లో ఉగ్ర దాడి
దీనికి ముందు, అక్టోబర్ 24న బారాముల్లాలోని గుల్మార్గ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ సైనికులు, ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా శనివారంనాడు చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు అధికారులు తెలిపారు. మరో సైనికుడు, సివిలియన్ పోర్టర్ చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 26 , 2024 | 02:47 PM