జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్‌పై అరెస్టు వారెంట్
ABN, Publish Date - May 20 , 2024 | 04:07 AM
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్‌పై బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు శనివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు దాఖలు చేసిన నోటీసుల గురించి కోర్టు..
బెంగళూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్‌పై బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు శనివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు దాఖలు చేసిన నోటీసుల గురించి కోర్టు.. సిట్ అధికారులను వివరణ కోరింది. 24 గంటల్లో లొంగిపోవాలని నోటీసు, లుక్ అవుట్ నోటీసు, బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశామనీ, అయినా విచారణకు హాజరు కాలేదని సిట్ అధికారులు కోర్టుకు వివరించారు. ప్రజ్వల్‌పై నాన్‌బెయిల్ వారెంట్ జారీ చేయాలనీ, పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు. అందుకు అనుగుణంగా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది
Updated Date - May 20 , 2024 | 04:07 AM