ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arvind Kejriwal: మా పథకాలకు భయపడే బీజేపీ అడ్డుకుంటోంది: కేజ్రీవాల్

ABN, Publish Date - Dec 28 , 2024 | 05:11 PM

నిరాధారమైన విచారణతో తమ పార్టీ 'మహిళా సమ్మాన్ యోజన'ను బలహీనపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తమ తమ పార్టీ పథలకు చూసి బీజేపీ భయపడుతోందన్నారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడంపై ఆ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. నిరాధారమైన విచారణతో తమ పార్టీ 'మహిళా సమ్మాన్ యోజన'ను బలహీనపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తు్న్న వేళ తమ తమ పార్టీ పథలకు చూసి బీజేపీ భయపడుతోందని, వాటిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ నేత సందీప్ దీక్షిత్‌ను అడ్డుపెట్టుకుందని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

AAP: 'ఆప్'కు షాక్... మహిళా సమ్మాన్ యోజన రిజిస్ట్రేషన్లపై ఎల్జీ కొరడా


'మహిళా యోజన పథకం' కింద మహిళలకు రూ.2,100 చొప్పున నెలవారీ ఆర్థిక సాయం, 'సంజీవని యోజన' పథకం కింద 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్య చికిత్సను 'ఆప్' ప్రకటించింది. తాము ప్రకటించిన రెండు పథకాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం, లక్షలాది మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని కేజ్రీవాల్ అన్నారు. ఈ పథకాలను ఆప్ విజయవంతం చేసినట్లయితే బీజేపీకి అనేక నియోజకవర్గాల్లో గట్టిదెబ్బ తగులుతుందని, చాలాచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోతుందని ఆ పార్టీనేతలే తనతో చెబుతున్నారని తెలిపారు. ఆప్ చేసిన రిజిస్ట్రేషన్ క్యాంపులు విజయవంతం కావడంతో బీజేపీ బెదిరింపు ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. క్యాంపులను చెల్లాచెదురు చేసేందుకు దుండగులను, పోలీసులను ఉసిగొలుపుతోందని అన్నారు.


రాజకీయ దురుద్దేశాలతోనే..

బీజేపీ రాజకీయ కారణాలతోనే ఆప్ పథకాలపై నకిలీ విచారణకు ఆదేశించినట్టు ఆయన చెప్పారు. ''ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు? మేము కేవలం ఎన్నికల వాగ్దానం చేశాం. మేము గెలిస్తే ఆ పథకాలను అమలు చేస్తాం. కేవలం మేము చేసింది అంతే'' అని అన్నారు. బీజేపీ తమ చర్యల ద్వారా ఆ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన, మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు సేవలు, ఉచిత విద్యుత్, నీళ్లు, మొహల్లా క్లినిక్‌లను నిలిపివేస్తారనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆయన విమర్శించారు.


జైలుకు వెళ్లేందుకు వెనుకాడను

ఆప్ పథకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ను బీజేపీ అడ్డుపెట్టుకుంటోందని, ఆప్‌ను అడ్డుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ''ప్రజల కోసం మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ దేశం వారి పూర్వీకుల ఆస్తి కాదు. ఓట్ల కోసం బహిరంగంగా డబ్బులు పంచుతున్న వ్యక్తిని వాళ్లు ఎందుకు ఆపడం లేదు'' అని కేజ్రీవాల్ సూటిగా బీజేపీని ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

National: ఢిల్లీలో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానులు ఎవరో మీకు తెలుసా.. వీరిలో తెలుగు వ్యక్తి కూడా..

Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 28 , 2024 | 05:12 PM