Arvind Kejriwal: యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..
ABN, Publish Date - May 11 , 2024 | 04:01 PM
భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్‌ని..
భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్‌ని ప్రారంభించారని, త్వరలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రాజకీయ జీవితాన్ని కూడా ముగించబోతున్నారని బాంబ్ పేల్చారు. మోదీ మరోసారి ప్రధాని అయితే.. యూపీ సీఎంగా యోగిని తొలగించి, మరొకరిని రంగంలోకి దింపుతారని అన్నారు. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాక నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అణుబాంబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ రియాక్షన్
‘‘అద్వానీ, మురళీ జోషి, శివరాజ్ చౌహాన్, వసుంధరా రాజే, ఖట్టర్, రమణ్ సింగ్.. వీళ్లందరి రాజకీయ జీవితాలు ముగిశాయి. ఇప్పుడు తర్వాతి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోదీ మరోసారి గెలిస్తే.. రెండు నెలల్లోనే యూపీ ముఖ్యమంత్రిని మార్చేస్తారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మన భారతదేశం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని.. ఎప్పుడైతే ఓ నియంత మొత్తం అధికారాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించాడో, అతడిని ప్రజలు నిర్మూలించారని చెప్పారు. ఇప్పుడు కూడా ఓ నియంత (ప్రధాని మోదీ ఉద్దేశిస్తూ) పుట్టుకొచ్చాడని, అతను ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని అనుకుంటున్నాడని, అందుకే ఓటేయొద్దని 140 కోట్ల భారతీయ ప్రజల్ని వేడుకోవడానికి ముందుకొచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.
మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?
బీజేపీలో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం వెనుక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇంజినీర్లుగా వ్యవహరించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికే తమ ఆప్ మంత్రులతో పాటు హేమంత్ సోరెన్, తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు జైల్లో ఉన్నారని చెప్పిన ఆయన.. బీజేపీ మరోసారి గెలిస్తే మమతా బెనర్జీతో (Mamata Banerjee) పాటు సీఎం ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, సీఎం పినరయి విజయన్, ఉద్ధవ్ ఠాక్రేలతో పాటు ఇతర విపక్ష నేతలు కూడా జైలుపాలవుతారని హెచ్చరించారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 11 , 2024 | 04:01 PM