Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయనున్న ఆప్
ABN, Publish Date - Apr 09 , 2024 | 05:52 PM
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కొట్టివేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. అత్యున్నత న్యాయస్థానంలో బుధవారంనాడు పిటిషన్ వేసే అవకాశం ఉందని 'ఆప్' వర్గాల సమాచారం.
Delhi Liquor Case: కేజ్రీవాల్ జైలులోనే...హైకోర్టులో దక్కని ఊరట
అరెస్టు తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధం కాదని హైకోర్టు మంగళవారంనాడు తీర్పుచెప్పింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని పేర్కొంది. హవాలా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్టు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం తెలిపింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడి వీలును బట్టి విచారణ సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 09 , 2024 | 05:52 PM