Delhi Liquor Case: కేజ్రీవాల్ జైలులోనే...హైకోర్టులో దక్కని ఊరట
ABN, Publish Date - Apr 09 , 2024 | 05:00 PM
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. అరెస్టు తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేయడం చట్టనిబంధనలకు విరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మంగళవారంనాడు కొట్టివేసింది. అరెస్టు తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేయడం చట్టనిబంధనలకు విరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. అప్రూవర్ల ప్రకటనలను విచారణలో పరిశీలించడం జరుగుతుందని, క్రాస్ ఎగ్జామిన్‌కు కేజ్రీవాల్‌కు అవకాశం ఉంటుందని విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. ప్రభుత్వ సాక్షుల యధార్థత పరీక్షించడం తమ పని అని కోర్టు పేర్కొంటూ, ఇది 100 ఏళ్లకు పైబడిన చట్టమని కోర్టు పేర్కొంది. అప్రూవర్ల స్టేట్‌మెంట్లను రికార్డు చేయడం ఇదే మొదటిసారి కాదని, దీనికి ముందు ఎన్నో కేసులు నమోదయ్యాయని తెలిపింది.
కేజ్రీవాల్ 'ఆప్' కన్వీనర్ అని, మనీలాండరింగ్ సొమ్ము గోవా ఎన్నికల్లో ప్రచారానికి ఖర్చు చేశారని ఈడీ వాదనగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కేజ్రీవాల్ ప్రమేయమున్నట్టు ఈడీ చెబుతోందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో రాఘవ్, శరత్ రెడ్డి సహా అనేక మంది వాంగ్మూలాన్ని రికార్డు చేశారని, కేజ్రీవాల్ బెయిలు కోసం కాకుండా కస్టడీని సవాలు చేస్తూ పిటిషన్ వేశారని తెలిపింది. ఈడీ వద్ద తగినంత సమాచారం ఉన్నందున ఈ అరెస్టు చోటుచేసుకుందని, విచారణకు కేజ్రీవాల్ సహకరించకపోవడం, జాప్యం చేయడం వల్ల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందని పేర్కొంది. కాగా, కేజ్రీవాల్ తన పిటిషన్‌లో ఈడీ అరెస్టుతో పాటు ఈడీ కస్టడీలో రిమాండ్‌ను సైతం సవాలు చేశారు. ఈడీ అరెస్టు చేసిన సమయాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ, ప్రచారం చేసుకునే హక్కుతో సహా రాజ్యాంగం కల్పించిన మౌలిక సూత్రాలకు ఇది భిన్నంగా ఉందని వాదించారు.
BJP state president: జైలు నుంచే సెంథిల్ బాలాజి డైరెక్షన్ చేస్తున్నారు...
ఔచిత్యం గురించి ప్రశ్నించొద్దు..
కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకిస్తూ, ఎలక్షన్లు ఉన్నాయనే కారణం చెప్పి తన అరెస్టు ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించడం సరికాదని పేర్కొంది. చట్టం అనేది సాధారణ పౌరుడికే కాకుండా ఆయనకు కూడా సమానంగా వర్తిస్తుందని వాదించింది. మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయగా ఏప్రిల్ 1న ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 09 , 2024 | 05:00 PM