ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: సిగ్గెందుకు.. వాటి వాడకంలో మేమే టాప్.. అసద్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 29 , 2024 | 11:10 AM

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచార జోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లను ఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు.

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచార జోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లను ఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే అర్థం వచ్చేలా మోదీ మాట్లాడారని.. ఎక్కువ మంది పిల్లలను కనకుండా జాగ్రత్తలు తీసుకునేది ముస్లింలేనని చెప్పారు.

అత్యధికంగా కండోమ్‌లు వాడుతున్న తమపై మోదీ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ మధ్యే రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ " దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని కాంగ్రెస్ చెప్పింది. అంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికే.. ఆస్తి పంచుతారు. మీరు కష్టపడి సంపాధించిన ఆస్తులు చొరబాటుదారులకు వెళ్లాలా?" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ కామెంట్స్‌పై స్పందించిన ఓవైసీ.. "ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారు. చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారంటూ మోదీ(PM Modi) చెప్తున్నారు. అలా అయితే.. మోదీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్‌కి 10 మంది సోదరీమణులు ఉన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోంది. కానీ హిందువుల్లో భయాన్ని సృష్టించేందుకు మోదీ ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరు. ముస్లింల పట్ల ఈ భయాన్ని ఎంతకాలం కొనసాగిస్తారు. దేశంలో ఉన్న 17 కోట్ల మంది భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అంటున్నారు. దళితులు, ముస్లింల పట్ల ద్వేషమే మోదీ గ్యారెంటీలా కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది" అని అసద్ అన్నారు.

హైదరాబాద్‌ లోక్ సభ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఉండటంతో అసద్‌తో పోటీ రసవత్తరంగా మారింది. తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Latest news and National News here..

Updated Date - Apr 29 , 2024 | 11:10 AM

Advertising
Advertising