ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: అసోంలో 40 శాతానికి ముస్లిం జనాభా: హిమంత

ABN, Publish Date - Jul 18 , 2024 | 05:16 AM

అసోంలో మారుతున్న జనాభా నిష్పత్తి తనకో పెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.

న్యూఢిల్లీ, జూలై 17: అసోంలో మారుతున్న జనాభా నిష్పత్తి తనకో పెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రస్తుతం అసోంలో ముస్లిం జనాభా 40శాతానికి చేరిందని, 1951లో ఇది 12ు మాత్రమేనని చెప్పారు. ‘ఇప్పటికే మేం చాలా జిల్లాలు కోల్పోయాం. ఇది నాకు రాజకీయ అంశం కాదు... జీవన్మరణ సమస్య’ అని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసోంలో మత ఘర్షణలకు బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన మైనారిటీలే కారణమని పేర్కొన్నారు.


అసోంలో మొత్తం 14 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీ-యూపీపీఎల్‌ కూటమి 11 స్థానాలు గెలుచుకోగా, మిగిలిన 3 సీట్లను కాంగ్రెస్‌ దక్కించుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కొంత పట్టుకోల్పోయిన బీజేపీ అక్కడ మొత్తం 24 స్థానాలకు గాను 15 సీట్లు గెలుచుకుంది. దీంతో.. ‘ఈశాన్య రాష్ట్రాల్లో ఒక మతం మా ప్రభుత్వానికిపూర్తి వ్యతిరేకంగా పనిచేసింది’ అని హిమంత వ్యాఖ్యానించారు.

Updated Date - Jul 18 , 2024 | 05:16 AM

Advertising
Advertising
<